100 రోజుల్లో రూ.100 కోట్లు ఖర్చు చేస్తాం
వేసవి సమస్యలని అధిగమించేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో వేసవిలో తలెత్తే సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. 100 రోజుల్లో రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సోమేశ్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్‌కి ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయడం వెనుక శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన మంత్రులకు, పార్లమెంటరీ కార్యదర్శులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాసు పీకిన విషయం కారణమై ఉండవచ్చేమో! ఇపుడు […]
Advertisement
వేసవి సమస్యలని అధిగమించేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో వేసవిలో తలెత్తే సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. 100 రోజుల్లో రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సోమేశ్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్‌కి ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయడం వెనుక శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన మంత్రులకు, పార్లమెంటరీ కార్యదర్శులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాసు పీకిన విషయం కారణమై ఉండవచ్చేమో! ఇపుడు టీఆర్ఎస్ జీహెచ్.ఎం.సి. ఎన్నికలపై దృష్టి పెట్టి ఉన్నందునన ఆయన మనిషిగా సోమేష్‌కుమార్ కూడా తనవంతు ప్రకటన చేశారని అనుకుంటున్నారు మిగతా రాజకీయ పార్టీల నాయకులు. నిజమో కాదో ఆయనకే తెలియాలి.-పీఆర్
Advertisement