ప్ర‌శాంతంగా ముగిసిన ‘మా’ పోలింగ్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల పోలింగ్ హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ప్ర‌శాతంగా ముగిశాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభ‌మైన‌ పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జ‌రిగింది.. పోలింగ్ కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను (ఈవీఎం) వినియోగించారు. ‘మా’లో ఉన్న 702 మందిలో అధిక సంఖ్య‌లో మెజారిటీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ‘మా’ అధ్యక్ష పదవి ఎన్నికపై సినిమా పరిశ్రమతోపాటు తెలుగు ప్రజల మధ్య ఆసక్తి నెలకొంది. […]

Advertisement
Update: 2015-03-29 05:29 GMT
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల పోలింగ్ హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ప్ర‌శాతంగా ముగిశాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభ‌మైన‌ పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జ‌రిగింది.. పోలింగ్ కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను (ఈవీఎం) వినియోగించారు. ‘మా’లో ఉన్న 702 మందిలో అధిక సంఖ్య‌లో మెజారిటీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ‘మా’ అధ్యక్ష పదవి ఎన్నికపై సినిమా పరిశ్రమతోపాటు తెలుగు ప్రజల మధ్య ఆసక్తి నెలకొంది. అధ్యక్ష పదవి రేసులో నటుడు రాజేంద్రప్రసాద్, నటి జయసుధ ప్రధానంగా పోటీలో ఉన్నారు. ‘మా’ ఎన్నికల విషయంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు పర్యవేక్షణలో ఎన్నికలు జ‌రిగాయి. కోర్టు ఆదేశాల ప్ర‌కారం ఎన్నికల ప్రక్రియను వీడియో తీశారు. కోర్టు ఆదేశాల తర్వాతే ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడి జరుగుతుంది.-పిఆర్‌.
Tags:    
Advertisement

Similar News