వీసా లేకుండా ఈ దేశాలకు టూరేయొచ్చు!

వీసా ఫ్రీ కంట్రీస్
వింటర్‌‌లో విదేశాలకు టూరేయాలనుకుంటున్నారా? దానికోసం పెద్దగా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఎన్నో అందమైన దేశాలు ఇండియన్స్‌కు వెల్‌కమ్ చెప్తున్నాయి. వీసా అవసరం లేకుండా ఇండియన్ పాస్‌పోర్ట్‌తో వెళ్లగలిగే కొన్ని దేశాలివీ..
శ్రీలంక
మన పొరుగు దేశమైన శ్రీలంకకు వెళ్లడానికి వీసా అవసరం లేదు. అందమైన హిల్ స్టేషన్స్, అడవులకు శ్రీలంక పెట్టింది పేరు. శ్రీలంకలో హార్టన్ ప్లెయిన్స్ నేషనల్ పార్క్, ఎల్లా, ఆడమ్స్ పీక్, నువారా, అనురాధపురా, బంబారకండ ఫాల్స్ వంటివి చూడదగ్గ ప్రదేశాలు.
ఫిజీ ఐలాండ్స్
సౌత్ పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు దగ్గర్లో ఉన్న ఫిజీ.. ఎంతో అందమైన దేశం. ఇక్కడి వరల్డ్ క్లాస్ బీచ్‌లు టూరిస్టులను కట్టిపడేస్తాయి. ఫిజి మ్యూజియం, కోలోసువా ఫారెస్ట్ పార్క్, సాబెటో హాట్ స్ప్రింగ్స్ వంటివి ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు.
మాల్దీవ్స్
మాల్దీవ్స్‌ను వరల్డ్స్ ఫేవరెట్ హనీమూన్ స్పాట్‌గా చెప్పుకోవచ్చు. బీచ్ లవర్స్‌కు ఇదొక ప్యారడైజ్. బనానా రీఫ్, గుల్హి బీచ్, సన్ ఐల్యాండ్, మేల్ సిటీ వంటివి ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు
సెషెల్స్
హిందూ మహాసముద్రంలో ఆఫ్రికా ఖండానికి కుడివైపున ఉండే సెషెల్స్ ఐలాండ్స్.. కోరల్ రీఫ్స్‌కు, బీచ్‌లకు ఫేమస్. మహే ఐల్యాండ్, కజిన్ ఐల్యాండ్, ప్రాస్లిన్ ఐల్యాండ్, బర్డ్ ఐల్యాండ్ వంటివి ఇక్కడ మస్ట్ విజిట్ ప్లేసులు.
ఇండోనేషియా
ప్రకృతి ప్రేమికుల ఫేవరెట్ డెస్టినేషన్ బాలి.. ఇండోనేషియాలోనే ఉంది. ఇక్కడికి వెళ్లడానికి వీసా అవసరం లేదు. బాలితో పాటు గిలీ ఐల్యాండ్, యుబుద్ మంకీ ఫారెస్ట్, తాంజుంగ్ నేషనల్ పార్క్, ఫ్లోరెస్ ఐల్యాండ్ వంటివి ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు.
భూటాన్
ప్రపంచంలోని హ్యాపియెస్ట్ కంట్రీస్‌లో భూటాన్ ఒకటి. ఇక్కడి పర్వతాలు, బౌద్ధ మొనాస్ట్రీలు ఎంతో పాపులర్. పునాకా జాంగ్, పారో మొనాస్ట్రీ, చెలెలా పాస్ వంటివి ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు.