క్యాంపింగ్ చేసేందుకు బెస్ట్ ప్లేసులివే

బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్
ట్రావెలింగ్ చేసే చాలామంది యువత క్యాపింగ్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. జనావాసానికి దూరంగా టెంట్ వేసుకోవడం, చలిమంటల వెచ్చదనంలో గడపడం అనేది మరపురాని అనుభూతి. మరి అలాంటి క్యాంపింగ్ కోసం బెస్ట్ ఆప్షన్లు ఏంటంటే..
కూర్గ్
సౌత్ ఇండియాలో క్యాపింగ్ చేసేందుకు ఉన్న బెస్ట్ ఆప్షన్స్‌లో కూర్గ్ ఒకటి. కర్నాటకలోని కూర్గ్ జిల్లాలో పదుల సంఖ్యలో హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి వింటర్ క్యాపింగ్‌కు చాలా అనువుగా ఉంటాయి.
జైసల్మేర్
మంచు కురిసేవేళలో ఎడారి క్యాంపింగ్ చేయాలంటే రాజస్తాన్‌లోని జైసల్మేర్ వెళ్లాల్సిందే. జైసల్మేర్‌‌కు చుట్టు పక్కల జనావాసం తక్కువ. ఎటుచూసినా ఎడారి ప్రాంతమే కనిపిస్తుంది. వింటర్‌‌లో డిజర్ట్ క్యాంపింగ్‌కు ఇది బెస్ట్ ఛాయిస్.
రణ్ ఆఫ్ కచ్
అందమైన తెల్లటి ఎడారిలో క్యాపింగ్ చేయాలంటే గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్‌కు వెళ్లాలి. డిసెంబర్ నెలలో ఇక్కడ రణ్ ఉత్సవ్ జరుగుతుంది. ఈ సీజన్‌లో ఇక్కడ క్యాపింగ్‌తో పాటు ఒంటె సఫారీ, కల్చరల్ యాక్టివిటీస్ వంటివి కూడా ఎంజాయ్ చేయొచ్చు.
భిమ్‌తాల్
ఉత్తరాఖండ్‌లోని భిమ్‌తాల్.. అందమైన హిల్ స్టేషన్స్‌లో ఒకటి. చుట్టూ ఎత్తైన కొండలు, కొండల నడుమ పారే నదిని ఎంజాయ్ చేస్తూ క్యాంపింగ్ ఎక్స్‌పీరియెన్స్ పొందొచ్చు.
స్పితి వ్యాలీ
జనావాసానికి దూరంగా ఎముకలు కొరికే చలిలో హిమాలయాల నడుమ.. క్యాపింగ్ చేయాలంటే హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీ వెళ్లాలి. ఇది దేశంలోనే అందమైన వ్యాలీల్లో ఒకటి. ఇక్కడ రాత్రిళ్లు స్టార్ గేజింగ్‌ను ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు.
జాగ్రత్తలు ముఖ్యం
క్యాంపింగ్ చేసేముందు ఆ ప్రాంతం సేఫ్ అవునా? కాదా? అన్నది చూసుకోవాలి. క్యాపింగ్‌కు కావాల్సిన అన్ని వస్తువులను జాగ్రత్తగా వెంట తీసుకెళ్లాలి.