ఫారెనర్స్ మెచ్చిన ఇండియా ఇదే!

టాప్ 5
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది విజిట్ చేస్తున్న దేశాల్లో మనదేశం ఐదో స్థానంలో ఉంది. మనదేశాన్ని విజిట్ చేస్తున్న విదేశీయల సంఖ్య ప్రతిఏటా పెరుగుతోంది. మనదేశంలో ఫారెనర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్న ప్రాంతాలేంటంటే..
గోవా
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బీచ్‌లున్నా.. మనదేశంలోని గోవా బీచ్‌లంటే విదేశీయులకు మోజు ఎక్కువ. గోవాలో ఉండే వరల్ట్ క్లాస్ హాస్పిటాలిటీ, హోటళ్లు, ఫుడ్, పార్టీ కల్చర్.. వాళ్లను మరింత ఆకర్షిస్తున్నాయి.
హంపి
మనదేశంలో ఫారెనర్స్ ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో హంపి ఒకటి. హంపిలోని వాతావరణం, అక్కడి ఆర్కిటెక్చర్ దృష్ట్యా ఎక్కువమంది విదేశీయులు హంపికి వస్తుంటారు.
తాజ్ మహల్
ఢిల్లీలో ఫ్లైట్ దిగిన ప్రతీ ఫారిన్ టూరిస్ట్.. మొదటగా విజిట్ చేసేది ఆగ్రానే. విదేశీయులకు ఇండియా అంటే మొదట గుర్తొచ్చేది తాజ్ మహల్. అందుకే ఏటా తాజ్ మహల్‌ను విజిట్ చేస్తున్న విదేశీయుల సంఖ్య పెరుగుతోంది.
కేరళ
మళ్లీమళ్లీ చూడాలనిపించే అందం రూరల్ ఇండియా సొంతం. ముఖ్యంగా కేరళ అందాలు విదేశీయులను కట్టిపడేస్తున్నాయి. ఇటీవల చాలామంది ఫారెనర్స్‌కు కేరళ హనీమూన్ డెస్టినేషన్‌గా మారింది.
ఢిల్లీ
ఫారెనర్స్ ఎక్కువగా విజిట్ చేసే ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటి. ఢిల్లీలోని హెరిటేజ్ సైట్స్‌తో పాటు లోకల్ ఫుడ్‌ను ఫారెనర్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
రాజస్తాన్
విదేశీయులకు ఇష్టమైన మరో ఇండియన్ డెస్టినేషన్ రాజస్తాన్. మంచు దేశాల్లో ఉండేవాళ్లు రిలాక్స్ అవ్వడం కోసం రాజస్తాన్ వస్తుంటారు. అంతేకాకుండా రాజస్తాన్‌లోని అందమైన ఎడారి, అద్భుతమైన కోటలు కూడా వాళ్లని కట్టిపడేస్తాయి.