సీఎంను అవమానించిన వారికి అదే పద్దతిలో తిరిగి సమాధానం చెప్పాలి: కేటీఆర్

“బీజేపీ పాలిస్తున్నకర్ణాటకలో అభ్యంతరకరమైన ట్వీట్ చేసినందుకు 14 రోజుల జైలు... తెలంగాణలో, మా సీఎం, మంత్రులు, శాసనసభ్యులను ప్రత్యక్షంగా, భయంకరంగా అవమానిస్తూ ఉంటే మేము సహిస్తున్నాము. మేము వారికి అదే పద్దతిలో తిరిగి సమాధానం ఇవ్వవలసి ఉంటుంది." అని వ్యాఖ్యానించారు కేటీఆర్.

Advertisement
Update: 2023-03-22 13:36 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ పరోక్షంగా సూచించారు.

హిందుత్వం అబద్దాల మీద నిర్మాణమయ్యిందని కర్నాటకలో నటుడు చేతన్ కుమార్ ట్వీట్ చేసినందుకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.

“బీజేపీ పాలిస్తున్నకర్ణాటకలో అభ్యంతరకరమైన ట్వీట్ చేసినందుకు 14 రోజుల జైలు... తెలంగాణలో, మా సీఎం, మంత్రులు, శాసనసభ్యులను ప్రత్యక్షంగా, భయంకరంగా అవమానిస్తూ ఉంటే మేము సహిస్తున్నాము. మేము వారికి అదే పద్దతిలో తిరిగి సమాధానం ఇవ్వవలసి ఉంటుంది." అని వ్యాఖ్యానించారు కేటీఆర్.

ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై యూట్యూబర్ చింతపండు నవీన్ కుమార్ , తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితల‌పై కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు BRS మద్దతుదారులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    
Advertisement

Similar News