Ram Charan: మేం మా నాన్నలా కాదు.. మాతో జాగ్రత్త -చరణ్

Ram Charan: "ఆయనంత మర్యాదస్తులం మేము కాదు, కాదని మేము మర్యాదగానే చెబుతున్నాం, మాతో జాగ్రత్త" అన్నారు చరణ్. ఈ వార్నింగ్ తో సినిమా ఫంక్షన్ కి చిన్న పొలిటికల్ టచ్ ఇచ్చారు.

Advertisement
Update: 2023-01-29 07:02 GMT

ఇటీవల చిరంజీవిపై రాజకీయ విమర్శలు చేస్తున్నవారికి ఆయన తనయుడు రామ్ చరణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాము ఆయనలా సైలెంట్ కాదని, తమతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. "ఆయనంత మర్యాదస్తులం మేము కాదు, కాదని మేము మర్యాదగానే చెబుతున్నాం, మాతో జాగ్రత్త" అన్నారు చరణ్. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ కోసం హన్మకొండ వచ్చిన చరణ్ ఈ వార్నింగ్ తో సినిమా ఫంక్షన్ కి చిన్న పొలిటికల్ టచ్ ఇచ్చారు.

పవన్ కల్యాణ్ రాజకీయాలకు చిరంజీవి మద్దతు ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.. వైసీపీ నుంచి వస్తున్న విమర్శలు మాత్రం చిరంజీవిని బలవంతంగా జనసేనకు జై కొట్టించేలా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో మంత్రి రోజా, చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలతో జనసైనికులు కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ తర్వతా పవన్ కల్యాణ్, నాగబాబు డైమండ్ రాణి వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. రోజాకి మద్దతుగా వైసీపీ నాయకులు గళం కలపడంతో ఆ గొడవ మరింత పెద్దదైంది. అయితే జనసేన, వైసీపీ మధ్య మటాల తూటాలు పేలడానికి మాత్రం పరోక్షంగా చిరంజీవే మెయిన్ సబ్జెక్ట్ అయ్యారు. అందుకే ఆయన్ని సీన్ లోకి తీసుకు రావొద్దని మరోసారి రామ్ చరణ్ హెచ్చరించారు.

పవన్ ప్రస్తావన దేనికోసం..?

వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో తాను జనసేన తరపున ప్రచారం చేయబోనని, రాజకీయాలకు దూరంగా ఉన్నానని చిరంజీవి క్లారిటీ ఇవ్వడంతో వైసీపీ నేతలు ట్రోలింగ్ మొదలు పెట్టారు. అన్నయ్య కూడా పవన్ రాజకీయాలను ఇష్టపడటం లేదని కౌంటర్లు ఇచ్చారు. కానీ మెగా ఫ్యామిలీ పవన్ ని దూరం పెట్టలేదని హన్మకొండలో జరిగిన వాల్తేరు వీరయ్య ఫంక్షన్ రుజువు చేసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్టిస్టుల్లో కొంతమంది పవన్ పేరుని పదే పదే ప్రస్తావించారు. ఆ సమయంలో చిరంజీవి కూడా సంతోషంగా కనిపించారు, వారి మాటల్ని ఎంజాయ్ చేశారు. చివర్లో రామ్ చరణ్ కూడా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ని హుషారెత్తించారు. మొత్తమ్మీద మెగా ఫ్యామిలీ సపోర్ట్ పవన్ కల్యాణ్ కి ఉన్నట్టేనని మరోసారి రుజువైంది. జనసేనపై విమర్శలు చేసే క్రమంలో పదే పదే చిరంజీవి పేరు ప్రస్తావించడం కూడా వైసీపీకి మైనస్ అనే చెప్పాలి. అందుకే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఇలా కౌంటర్లు పడుతున్నాయి. చరణ్ వ్యాఖ్యలపై మంత్రి రోజా ఎలా స్పందిస్తారో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News