తెలంగాణకు వస్తున్న ప్రధానిని తాను ఆహ్వానిస్తానన్న టీఆరెస్ నేత స్వామి గౌడ్

ఈ మధ్యే బీజేపీ నుంచి టీఆరెస్ లో తిరిగి చేరిన స్వామి గౌడ్ ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ తెలంగాణకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని తాను ఆహ్వానిస్తానన్నారు.

Advertisement
Update: 2022-11-11 11:37 GMT

రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి తాను స్వాగతిస్తానని టీఆరెస్ నాయకుడు స్వామి గౌడ్ అన్నారు.పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ తాను వ్యక్తిగతంగా మాత్రం ప్రధానిని ఆహ్వానిస్తానన్నారు స్వామి గౌడ్.

ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని ఏమీ ఇవ్వకపోయినప్పటికీ ప్రధానిగా ఆయనను గౌరవించాలన్నారు స్వామి గౌడ్. తనది పెద్దలను గౌరవించే సాంప్రదాయం గల కుటుంబమన్నారాయన. అవకాశం వస్తే విభజన హామీలు నెరవేర్చాలని ప్రధానినే అడుగుతానని చెప్పారు స్వామిగౌడ్.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో అవకాశం వస్తే అక్కడ, పార్టీ అధ్యక్షుడు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ తాను పోరాడుతానని స్వామిగౌడ్ అన్నారు. భారత రాష్ట్రసమితిలో తన పాత్రపై మాట్లాడిన స్వామిగౌడ్ కేసీఆర్ అవకాశం ఇస్తే బీఆరెస్ లో కీలక పాత్ర పోషించడానికి సిద్దమన్నారు. తాను పార్టీని రాజేంద్ర నగర్ అసెంబ్లీ సీటు అడిగానని, పార్టీ ఎక్కడిస్తుందో తెలియదని ఆయన తెలిపారు. ఎక్కడిచ్చినా పోటీ చేయడానికి తాను సిద్దమన్నారు స్వామి గౌడ్. 

Tags:    
Advertisement

Similar News