మోడీ చెప్పినా ఆగని కాషాయ దళాలు... హైదరాబాద్ లో ‘పఠాన్’ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్ పై దాడి

బీజేపీ నాయకులు నిరసనలు ఆపేసినప్పటికీ మిగతా కాషాయవాదులు మాత్రం తమ నిరసనలను ఆపలేదు. ఈ రోజు హైదరాబాద్ లో పఠాన్ మూవీ ప్రదర్శించే కాచిగూడలోని ఏషియన్ తారకరామ సినీప్లెక్స్ థియేటర్ పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారు.

Advertisement
Update: 2023-01-26 09:40 GMT

షారూక్ ఖాన్ , దీపికా పదుకొనే నటించిన పఠాన్ మూవీపై కాషాయ వర్గాల నిరసనలు ఆగడంలేదు. ఈ మూవీకి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించి, నిరసనలకు దిగిన నేపథ్యంలో సినిమాల గురించి అనవసర‍గా మాట్లాడవద్దంటూ మోడీ వారిని ఆదేశించారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఈ అంశంపై మాట్లాడారు. ఇకపై సినిమాలపై అనవసర రచ్చ చేయొద్దంటూ తమ నాయకులకు సూచించారు. అప్పటి నుంచి బీజేపీ నాయకులు పఠాన్ మూవీపై నిరసనలు, వ్యాఖ్యలు ఆపేశారు.

బీజేపీ నాయకులు నిరసనలు ఆపేసినప్పటికీ మిగతా కాషాయవాదులు మాత్రం తమ నిరసనలను ఆపలేదు. ఈ రోజు హైదరాబాద్ లో పఠాన్ మూవీ ప్రదర్శించే కాచిగూడలోని ఏషియన్ తారకరామ సినీప్లెక్స్ థియేటర్ పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారు. 

వందల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు... కొందరు చేతిలో కాషాయ జెండాలు పట్టుకుని థియేటర్‌లోకి దూసుకెళ్ళగా, మరికొందరు టెర్రస్‌పైకి ఎక్కి ‘బంద్‌ కరో, బంద్‌ కరో, పఠాన్‌ మూవీ బంద్‌ కరో’, ‘షారూఖ్‌ డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలు చేస్తూ సినిమా పోస్టర్లపై నల్ల ఇంకును పూశారు. పఠాన్ సినిమా పోస్టర్ లను చించి వేశారు. దాంతో కొంత సేపు థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భజరంగ్ దళ్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

దీంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు పఠాన్ మూవీ ప్రదర్శిస్తున్న నగరంలోని థియేటర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News