తెలంగాణ: ఫిబ్రవరి 5, 6 తేదీల్లో 32 బీసీ ఆత్మ గౌరవ భవనాలకు శంకుస్థాపన

ఫిబ్రవరి 5న కోకాపేటలో. ఫిబ్రవరి 6న పీర్జాదిగూడలో ఈ భవనాలకు శంఖుస్థాపన జరగనుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతాయని ఆయన చెప్పారు.

Advertisement
Update: 2023-01-26 05:20 GMT

బీసీల ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భవనాల నిర్మాణ కార్యక్రమం వచ్చేనెల 5న ప్రారంభం కాబోతుంది. 32 బీసీ ఆత్మగౌరవ భవనాలు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో శంఖుస్థాపన చేయనున్నది ప్రభుత్వం.

ఫిబ్రవరి 5న కోకాపేటలో. ఫిబ్రవరి 6న పీర్జాదిగూడలో ఈ భవనాలకు శంఖుస్థాపన జరగనుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతాయని ఆయన చెప్పారు.

32 మంది బీసీ కులాల ప్రజాప్రతినిధులతో సమావేశమైన కమలాకర్ మాట్లాడుతూ.. 41 బీసీ సంఘాలకు ప్రత్యేకంగా భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయల విలువగల భూమిని కేటాయించారన్నారు. ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన అనేక సంస్థలు తమ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం ఏకతాటిపైకి వచ్చాయన్నారు.

“ఇప్పటికే అనుమతులు పొందిన భవనాల నిర్మాణాలు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో ప్రారంభమవుతాయి.

మార్చి 31 నాటికి స్లాబ్‌లు పూర్తవుతాయి. ఏదైనా సంఘం ముందుకు రాకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణాన్ని చేపడుతుంది. అయితే, బీసీ కులాలు ఏకతాటిపైకి వచ్చి ఈ భవనాల నిర్మాణాన్ని సులభతరం చేసేందుకు నిర్ణయం తీసుకోవాలి.'' అని మంత్రి సలహా ఇచ్చాడు. ఈ భవనాల్లో ఫంక్షన్ హాళ్లు, కాన్ఫరెన్స్ హాల్స్, స్టూడెంట్ హాస్టల్స్, రిక్రియేషన్ వంటి అనేక సౌకర్యాలు ఉంటాయి.

రోడ్లు, విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్లు, తాగునీరు, డ్రైనేజీ పైప్‌లైన్‌లతోపాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల్లో సమన్వయం కోసం బీసీ సంక్షేమం, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ, విద్యుత్, రోడ్లు భవనాల శాఖల అధికారులతో అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ లేఅవుట్లలో. కుల సంఘాలతో సమన్వయం చేసేందుకు ప్రభుత్వం ఒక్కో భవనానికి లైజనింగ్‌ అధికారులను కూడా నియమించింది.

Tags:    
Advertisement

Similar News