తొమ్మిదేళ్లుగా పేరు లేని పాప.. నామకరణం చేసిన సీఎం కేసీఆర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా నందిగామ గ్రామానికి చెందిన సురేశ్, అనిత దంపతులకు 2013లో ఆడపిల్ల జన్మించింది. ఉద్యమ రథ‌సారథి కేసీఆర్ అంటే ఎంతో అభిమానం చూపించే సురేశ్.. తన పాపకు ఆయనతోనే పేరు పెట్టించాలనుకున్నాడు.

Advertisement
Update: 2022-09-19 03:14 GMT

అతనో తెలంగాణ ఉద్యమకారుడు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమంలో క్రియాశీల‌కంగా పనిచేశాడు. రాష్ట్రం ఏర్పాటు కాకముందే ఓ ఆడబిడ్డ జన్మించింది. అయితే తన పాపకు కేసీఆర్‌తోనే నామకరణం చేయించాలని పట్టుబట్టి కూర్చున్నాడు. చివరకు 9 ఏళ్ల తర్వాత ఆ కల సాకారం అయ్యింది. వివరాల్లోకి వెళితే..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా నందిగామ గ్రామానికి చెందిన సురేశ్, అనిత దంపతులకు 2013లో ఆడపిల్ల జన్మించింది. ఉద్యమ రథ‌సారథి కేసీఆర్ అంటే ఎంతో అభిమానం చూపించే సురేశ్.. తన పాపకు ఆయనతోనే పేరు పెట్టించాలనుకున్నాడు. ఇంత కాలం అసలు ఆ పాపకు పేరే పెట్టకుండా పెంచుతున్నాడు.


పాపకు పేరు పెట్టని విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి వెంటనే ఆ దంపతులను ప్రగతిభవన్‌కు తీసుకొని వచ్చారు. ఆదివారం పాపతో సహా సీఎం కేసీఆర్‌ను కలిసి విషయం చెప్పారు. ఆ దంపతులిద్దరినీ దీవించి.. పాపకు 'మహతి' అని పేరు పెట్టారు. దంపతులిద్దరికీ సీఎం కేసీఆర్, ఆయన భార్య శోభ కొత్త బట్టలు, పాపకు బహుమతులు అందించారు. అంతే కాకుండా పాప చదువు కోసం ఆర్థిక సాయం కూడా అందించారు. తమ కోరికను 9 ఏళ్ల తర్వాతైనా తీర్చుకోగలిగినందుకు దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. తమను సొంత మనుషుల్లా ఆదరించిన కేసీఆర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. తమను ఇక్కడి వరకు తీసుకొచ్చిన మాజీ స్పీకర్ మధుసూదనాచారికి ధన్యవాదాలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News