వరద సహాయక చర్యలపై కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్..

పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలని, సాగునీటి వనరులకు సంబంధించిన పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. వర్షాలు తగ్గాక అవసరమైతే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.

Advertisement
Update: 2022-07-27 11:39 GMT

తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. కాలి గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన.. ప్రగతి భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌ తో పాటు పలు పట్టణాల్లో పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వర్షాలు, వరద పరిస్థితులపై ఉన్నతాధికారులు మంత్రికి వివరాలు తెలియజేశారు. సహాయక చర్యల గురించి వివరించారు.


ప్రాణనష్టం జరగకుండా చూడzమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్. వర్షాలు మరిన్ని రోజులు కొనసాగితే ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. పురాతన భవనాలను తొలగించే పనులు చేపట్టాలని, కల్వర్టులు, వంతెనల వద్ద హెచ్చరిక సూచీలు పెట్టాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి సేవలు వినియోగించుకోవాలన్నారు. పురపాలక సంస్థల్లో సహాయ చర్యలను సీఎండీఏ పర్యవేక్షించాలని చెప్పారు. పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలని, సాగునీటి వనరులకు సంబంధించిన పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. వర్షాలు తగ్గాక అవసరమైతే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.

ఆరోగ్యం సహకరించకున్నా..

కాలి గాయంతో ఆరోగ్యం సహకరించకపోయినా కేటీఆర్ వరద సహాయక చర్యలపై దృష్టిపెట్టారు. తన పుట్టినరోజు సందర్భంగా వరద బాధితులను గిఫ్ట్ ఎ స్మైల్ పేరుతో ఆదుకోవాలని మూడు రోజుల క్రితం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోసారి హైదరాబాద్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, వరదలు, వర్షాల వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదని అధికారులకు ఆదేశాలిచ్చారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News