అలాంటి వారికి కూడా తగిన బుద్ది చెప్పాలి : మంత్రి కేటీఆర్

బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఒక మతాన్ని కించపరుస్తూ యాక్టర్ చేతన్ కుమార్ ట్వీట్ చేయగా.. అతడికి 14 రోజుల జైలు శిక్ష విధించారు.

Advertisement
Update: 2023-03-22 06:17 GMT

బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్లతో విమర్శల వర్షం కురిపించారు. కర్ణాటకలో ప్రముఖ కన్నడ యాక్టర్ చేతన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ మతాన్ని కించపరుస్తూ ట్వీట్ చేశాడన్న అభియోగాలపై అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఒక మతాన్ని కించపరుస్తూ యాక్టర్ చేతన్ కుమార్ ట్వీట్ చేయగా.. అతడికి 14 రోజుల జైలు శిక్ష విధించారు. మరి మన రాష్ట్రంలో అంత కంటే దారుణంగా సీఎం, మంత్రులు, శాసన సభ్యులను కించపరుస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో మాటలు అంటున్నారు. అయితే మేము సహిస్తూనే ఉన్నాము. ఇకపై అలాంటి వారికి కూడా మనం అదే విధంగా తగిన బుద్ది చెప్పాల్సి ఉంటుందని కేటీఆర్ అన్నారు.

భావ వ్యక్తీకరణ హక్కు అనే దాన్ని దుర్వినియోగం చేయకూడదు. దీనిపై ప్రజలు ఏమంటారు అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ను కూడా ప్రతిపక్షాలు వదలడం లేదు. ఇష్టానుసారం, నోటికి వచ్చినంత, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అయినా సరే అలాంటి వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు. ఇకపై అలాంటి వారికి తగిన బుద్ది చెప్పాలనే రీతిలో కేటీఆర్ ట్వీట్ చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఇటీవల కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అప్పుడు కూడా కేటీఆర్ సరదాగా చలోక్తులు విసిరారు. కానీ, ఎలాంటి ప్రత్యారోపణలు చేయలేదు. ఇకపై అలాంటి వాటి పట్ల కఠినంగా ఉండాలని కేటీఆర్ భావిస్తున్నారు. 


Tags:    
Advertisement

Similar News