హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..

అమీర్‌ పేట-రాయదుర్గం కారిడార్‌ లో ప్రతి 7 నిమిషాలకు ఓ రైలు నడవాల్సి ఉండగా.. షార్ట్ లూప్ ట్రిప్పుల కారణంగా ఇకపై పీక్ అవర్స్ లో ప్రతి 4.30 నిమిషాలకు ఒక రైలు నడుస్తుంది. దీంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చు.

Advertisement
Update: 2023-04-26 06:40 GMT

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..

సర్వీసుల సంఖ్య పెంచకుండానే రద్దీ తగ్గించేందుకు హైదరాబాద్ మెట్రో కొత్త నిర్ణయం తీసుకుంది. రద్దీ వేళల్లో రైళ్ల సంఖ్యను పెంచకుండా షార్ట్ లూప్ ట్రిప్పుల పేరిట ప్రత్యామ్నాయ మార్గం కనుగొంది. దీని వల్ల రైళ్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం లేదు, అదే సమయంలో ప్రయాణికులకు రద్దీ సమస్య కూడా తగ్గుతుంది.

షార్ట్ లూప్ ట్రిప్పులు..

ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో షార్ట్ లూప్ ట్రిప్పులను అందుబాటులోకి తెస్తోంది మెట్రో యాజమాన్యం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అమీర్‌ పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల నుంచి షార్ట్ లూప్ ట్రిప్పులు నడుస్తాయి.

అమీర్‌ పేట్‌ నుంచి రాయదుర్గం వైపు వెళ్లాల్సిన ప్రయాణికులు నాగోల్‌ నుంచి వచ్చే ట్రైన్‌ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా అమీర్‌ పేట్‌ నుంచి రాయదుర్గం వరకు ఈ షార్ట్‌ ట్రిప్పులు అందుబాటులోకి వస్తున్నాయి. రద్దీ లేని మార్గాల్లో ఖాళీగా ఉన్న రైళ్లను రెండో ట్రాక్ ద్వారా తెప్పించి రద్దీ ఉన్న మార్గాల్లో నడపడాన్నే షార్ట్ లూప్ ట్రిప్పులు అంటారు.

అమీర్‌ పేట-రాయదుర్గం కారిడార్‌ లో ప్రతి 7 నిమిషాలకు ఓ రైలు నడవాల్సి ఉండగా.. షార్ట్ లూప్ ట్రిప్పుల కారణంగా ఇకపై పీక్ అవర్స్ లో ప్రతి 4.30 నిమిషాలకు ఒక రైలు నడుస్తుంది. దీంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చు.

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య రోజుకి 4 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య ఐదు లక్షలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. వేసవిలో పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్రో ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా షార్ట్‌ లూప్‌ ట్రిప్పులు నడుపుతోంది. దీనివల్ల ప్రయాణికులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేయొచ్చని, ఎప్పటికప్పుడు రద్దీని నియంత్రించవచ్చని మెట్రో అధికారులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News