ఎట్టకేలకు తెలంగాణకు మెగా టెక్స్‌టైల్ పార్క్

పీఎం మిత్ర (మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపెరల్) కింద తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో మెగా టెక్స్‌టైల్ పార్క్ లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు.

Advertisement
Update: 2023-03-18 02:18 GMT

Mega Textile Park in Telangana: ఎట్టకేలకు తెలంగాణకు మెగా టెక్స్‌టైల్ పార్క్

ఎట్టకేలకు, రాష్ట్రంలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలనే తెలంగాణ ప్రభుత్వ చిరకాల డిమాండ్నుకేంద్ర బీజేపీ సర్కార్ ఒప్పుకుంది.

పీఎం మిత్ర (మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపెరల్) కింద తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో మెగా టెక్స్‌టైల్ పార్క్ లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు.

గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్‌గా వర్గీకరించబడిన ఈ పార్కుల కోసం కేంద్రం సహాయం 51 శాతం ఉంటుంది మిగిలిన మొత్తాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి.

తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌ స్వయంగా ప్రధానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం గత ఆరేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలన్నీ ఎట్టకేలకు ఫలించాయి.

ఆజంజాహీ మిల్లు చాలా కాలం క్రితం మూతపడిన తర్వాత వరంగల్ చరిత్రను పరిగణనలోకి తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శాయంపేటలో 2 వేల ఎకరాల భూమిని కేటాయించారు. 2017 అక్టోబర్ 22న మెగా టెక్స్‌టైల్ పార్కుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

Tags:    
Advertisement

Similar News