కేసీఆర్ ట్వీట్ పై సీఎం, డిప్యూటీ సీఎం రియాక్షన్

సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ట్వీట్ పై స్పందించారు. ఆ ప్రాంతంలో కరెంటు పోలేదని, కావాలనే కేసీఆర్ అలాంటి ట్వీట్లు వేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Update: 2024-04-28 07:23 GMT

తెలంగాణలో కాంగ్రెస్ కి కరెంటు కష్టాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ హయాంలో కరెంటు సరఫరాపై ఫిర్యాదులే లేవు. కానీ కాంగ్రెస్ రాగానే కరెంటు కోతలు వచ్చేశాయి. రైతులకు సరఫరా అయ్యే విద్యుత్ మాత్రమే కాదు గృహ సరఫరాకు కూడా అంతరాయం ఎదురవుతుందనే విమర్శలు వినపడుతున్నాయి. దీనిపై తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు కరెంటు పోయిందని అన్నారు. ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో వెంటనే కాంగ్రెస్ నష్టనివారణ చర్యలకు దిగింది.


సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ట్వీట్ పై స్పందించారు. ఆ ప్రాంతంలో కరెంటు పోలేదని, కావాలనే కేసీఆర్ అలాంటి ట్వీట్లు వేస్తున్నారని మండిపడ్డారు. అసలు కేసీఆర్ ఎంతసేపు అన్నం తిన్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కరెంటు పోకపోయినా పోయిందని అంటున్నారని, పదేళ్లు సీఎంగా పనిచేసిన నాయకులు ఇలా తప్పుడు ట్వీట్లు వేయడం సరికాదన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ట్విట్టర్ ద్వారా కేసీఆర్ ఆరోపణలను ఖండించారు. శ్రీనివాస్ గౌడ్ ఇంట్లోనే కాదు, ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కరెంటు పోలేదని చెప్పారు భట్టి. డిజిటల్ మీటర్లు ఎవరి ప్రమేయం లేకుండానే రీడింగ్ నమోదు చేస్తాయని, అక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా జరిగిందన్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల సూర్యాపేటలో సైతం ఇదే తరహాలో విద్యుత్ శాఖను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించి అభాసుపాలయ్యారని అన్నారు భట్టి. అబద్దాలతో, అసత్య ప్రచారాలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

Tags:    
Advertisement

Similar News