రిమోట్ ఓటింగ్ మెషీన్ విధానాన్ని వ్యతిరేకించిన‌ బీఆర్ఎస్

ఇప్పుడు వాడుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లే హ్యాకింగ్ కు గురవుతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రిమోట్ ఓటింగ్ మెషీన్ ను ఎలా నమ్మగలం అని టీఆరెస్ నేత వినోద్ కుమార్ ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాలనే హ్యాక్ చేస్తున్న ఈ కాలంలో రిమోట్ ఓటింగ్ ను హ్యాక్ చేయడం కష్టమా అన్నారాయన.

Advertisement
Update: 2023-01-17 01:35 GMT

కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదిస్తున్న రిమోట్ ఓటింగ్ మెషీన్ (ఆర్ వీఎమ్) విధానాన్ని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకించింది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఈవీఎంలనే పక్కనబెడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రిమోట్ ఓటింగ్ మెషీన్లను తీసుకువచ్చే ప్రయత్నం సరికాదని తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

ఇప్పుడు వాడుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లే హ్యాకింగ్ కు గురవుతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రిమోట్ ఓటింగ్ మెషీన్ ను ఎలా నమ్మగలం అని ఆయన ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాలనే హ్యాక్ చేస్తున్న ఈ కాలంలో రిమోట్ ఓటింగ్ ను హ్యాక్ చేయడం కష్టమా అన్నారాయన. ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి ఓటును అతనే వేస్తాడని నమ్మకేంటని హ్యాక్ చేసి ఎవ్వరైనా వేయగలరని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. మన దేశంలో ఇలాంటి పద్దతులు అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News