వందోటెస్టులో వంద పరుగుల వార్నర్!

ఆస్ట్ర్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన ఘనత సాధించాడు.

Advertisement
Update: 2022-12-27 05:46 GMT

ఆస్ట్ర్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. వందో టెస్టులో వంద పరుగులు చేయడం ద్వారా హేమాహేమీల సరసన నిలిచాడు.

క్రికెట్ బ్యాట్ పట్టిన ప్రతి ఆటగాడు జీవితకాలంలో కనీసం ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడినా తమ జీవితం ధన్యమైనట్లే భావిస్తారు. అదే 100 టెస్టులు ఆడే అవకాశం వస్తే...వందో టెస్టు ఆడుతూ వంద పరుగులు చేసే అవకాశం వస్తే..అంతకుమించిన అదృష్టం, అరుదైన ఘనత మరొకటి ఉండదు. అలాంటి అరుదైన ఘనతను ఆస్ట్ర్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సొంతం చేసుకొన్నాడు.

బాక్సింగ్ డే టెస్టులో వార్నర్ షో...

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా..దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా జరుగుతున్నరెండోటెస్ట్ రెండోరోజుఆటలో వార్నర్ 100 పరుగుల స్కోరుతో అరుదైన క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించాడు.

తన కెరియర్ లో 100వ టెస్టుమ్యాచ్ ఆడుతున్న 36 ఏళ్ల వార్నర్ గత మూడేళ్లుగా సెంచరీ చేయక అయోమయంలో చిక్కుకొన్నాడు. విమర్శకుల నుంచి తీవ్రఒత్తిడి

ఒత్తిడి ఎదుర్కొంటూ వచ్చిన వార్నర్..తనదైన శైలిలో మెరుపు సెంచరీ సాధించడం ద్వారా దీటైన సమాధానం చెప్పాడు.

సఫారీ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ 144 బంతుల్లో 15 బౌండ్రీలతో మూడంకెల స్కోరును అందుకొన్నాడు. ప్రస్తుత టెస్టు వరకూ 100 మ్యాచ్ లు ఆడిన వార్నర్ కు ఇది 25వ శతకం కావడం విశేషం. ఈ క్రమంలోనే 8వేల టెస్టు పరుగులు పూర్తి చేసిన 8వ ఆస్ట్ర్రేలియా క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

దిగ్గజాల సరసన వార్నర్..

టెస్టు చరిత్రలో 100వ టెస్టు ఆడుతూ వంద పరుగులు చేసిన మొనగాళ్లు 9 మంది వార్నర్ కంటే ముందే ఉన్నారు. శతటెస్టులో శతకం బాదిన దిగ్గజాలలో కోలిన్ కౌడ్రే, గార్డన్ గ్రీనిడ్జ్, జావేద్ మియాందాద్, రికీ పాంటింగ్, అలెక్ స్టెవార్ట్, ఇంజమాముల్ హక్, గ్రీమ్ స్మిత్, హషీమ్ ఆమ్లా, జో రూట్ ఉన్నారు.

మొత్తం 10 మందిలో ఇంగ్లండ్ కు చెందిన ముగ్గురు, పాక్, దక్షిణాఫ్రికా, ఆస్ట్ర్రేలియాలకు చెందిన ఇద్దరు, వెస్టిండీస్ కు చెందిన ఒక్కరు ఉన్నారు. గత మూడుసంవత్సరాలుగా టెస్టు శతకం కోసం నానాపాట్లు పడుతూ వచ్చిన వార్నర్..తన వందో టెస్టులో వంద పరుగులు చేయడం ద్వారా రికార్డును చిరస్మరణీయం చేసుకోగలిగాడు.

Tags:    
Advertisement

Similar News