టీ-20 ప్రపంచకప్ లో విరాట్ విశ్వరూపం!

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ లో భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.

Advertisement
Update: 2022-11-05 06:22 GMT

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ లో భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. పలు విధాలుగా రికార్డుల మోత మోగిస్తున్నాడు. 15 సంవత్సరాల ప్రపంచకప్ చరిత్రలోనే అత్యుత్తమ సగటు నమోదు చేసిన బ్యాటర్ గా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు...

ఎంతలో ఎంతమార్పు. గత రెండేళ్లుగా పరుగులు, శతకాల కోసం నానాపాట్లు పడిన భారత పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ గత మూడుమాసాలుగా టీ-20 ఫార్మాట్లో చెలరేగిపోతున్నాడు. తన ఆటతీరుతో ..క్లాస్ ఈజ్ పెర్మనెంట్, ఫామ్ ఈజ్ టెంపరరీ అన్న క్రికెట్ నానుడిని నిజం చేశాడు.

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో విరాట్ విశ్వరూప ప్రదర్శన కొనసాగుతోంది. దుబాయ్ వేదికగా జరిగిన 2022 ఆసియాకప్ టోర్నీ ద్వారా పడిలేచిన కెరటంలా దూసుకొచ్చిన విరాట్ ఆటతీరు ప్రస్తుత ప్రపంచకప్ లో టాప్ గేర్ ను అందుకొంది.

4మ్యాచ్ లు 3 అజేయ హాఫ్ సెంచరీలు...

ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్ -2 రౌండ్లో భాగంగా ఇప్పటి వరకూ భారత్ ఆడిన నాలుగురౌండ్ల మ్యాచ్ ల్లో విరాట్ మూడు అజేయ హాఫ్ సెంచరీలతో పలు అరుదైన ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మెల్బోర్న్ వేదికగా ముగిసిన తొలిరౌండ్ పోరులో విరాట్ 82 పరుగుల నాటౌట్ స్కోరుతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన మ్యాచ్ ల్లో సైతం హాఫ్ సెంచరీలతో నాటౌట్ గా నిలిచాడు.

ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటికే అత్యధిక పరుగులు, అత్యధిక అర్థశతకాల రికార్డులు నమోదు చేసిన విరాట్...సగటులో సైతం అత్యుత్తమ ఆటగాడిగా మరో ప్రపంచ రికార్డు సాధించాడు.

ఇప్పటి వరకూ ఆడిన నాలుగురౌండ్లలో విరాట్ 220 పరుగులతో 220.00 సగటు నమోదు చేశాడు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యుత్తమ సగటు నమోదు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. మహ్మద్ రిజ్వాన్, మైకేల్ హస్సీ, బాబర్ అజామ్, చరిత అసలంకాలను అధిగమించి అగ్రస్థానానికి చేరాడు.

ప్రస్తుత ప్రపంచకప్ మొదటి నాలుగురౌండ్ల మ్యాచ్ ల్లో 220.00 సగటు సాధించిన విరాట్...ఇప్పటి వరకూ ఆడిన ఐదు ప్రపంచకప్ టోర్నీలలో 89.0 సగటుతో ఆల్ టైమ్ గ్రేట్ గా అవతరించాడు.

ప్రపంచకప్ లో 10 ఇన్నింగ్స్ సగటును తీసుకొంటే మైకేల్ హస్సీ, మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ లకు మాత్రమే 50.0 సగటు ఉంది. ఆ ముగ్గురి సగటు రికార్డును విరాట్ అధిగమించాడు.

సగటున ఒక్కో ఇన్నింగ్స్ కు 46.3 సగటును విరాట్ నమోదు చేస్తే...మైకేల్ హస్సీ రెండు, కెవిన్ పీటర్సన్ మూడు స్థానాలలో కొనసాగుతున్నారు.

అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు..

ప్రస్తుత ప్రపంచకప్ లో ఇప్పటికే మూడు అర్థశతకాలు బాదిన విరాట్...ఓవరాల్ గా 13 హాఫ్ సెంచరీలతో నంబర్ వన్ బ్యాటర్ గా మరి రికార్డును తన పేరుతో లిఖించుకొన్నాడు.

తన కెరియర్ లో ఐదో ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటున్న విరాట్ మొత్తం 23 మ్యాచ్ ల్లో మహేల జయవర్థనే 1016 పరుగుల రికార్డును తెరమరుగు చేయగలిగాడు.

మహేల మొత్తం 31 మ్యాచ్ ల్లో 1016 పరుగులు సాధిస్తే...విరాట్ అంతకంటే ఎనిమిది ఇన్నింగ్స్ తక్కువలోనే ఈ ఘనత సాధించడం విశేషం

మహేల జయవర్థనే 134. 74 స్ట్ర్రయిక్ రేట్ తో 39. 07 సగటు సాధించాడు.

దక్షిణాఫ్రికాతో పెర్త్ వేదికగా ముగిసిన మూడోరౌండ్ మ్యాచ్ లో 12 పరుగుల స్కోరు సాధించడం ద్వారా టీ-20 ప్రపంచకప్ లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరిన రెండో బ్యాటర్ గా నిలిచిన విరాట్ ..నాలుగోరౌండ్లో అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డు నెలకొల్పగలిగాడు. ప్రపంచకప్ లో విరాట్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 89 పరుగుల నాటౌట్ గా ఉంది.

ప్రస్తుత ప్రపంచకప్ తో కలసి ఐదుసార్లు ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొన్న విరాట్ ...గత నాలుగు ప్రపంచకప్ టోర్నీలలో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డులు గెలుచుకొన్నాడు. విరాట్ సాధించిన మొత్తం 13 అర్ధశతకాలలో 11సార్లు నాటౌట్ గా మిగలడం విశేషం. కరీబియన్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ 33 మ్యాచ్ ల్లో 965 పరుగులు, భారత కెప్టెన్ రోహిత్ శర్మ 36 మ్యాచ్ ల్లో 919 పరుగులతో తర్వాతి స్థానాలలో ఉన్నారు.

టీ-20 ఫార్మాట్లో విరాట్ ఇప్పటి వరకూ 3వేల 932 పరుగులతో నెంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు. 3వేల 811 పరుగులతో రోహిత్ రెండు, 3వేల 531 పరుగులతో మార్టిన్ గప్టిల్ మూడు, 3వేల 239 పరుగులతో బాబర్ అజామ్ నాలుగు స్థానాలలో ఉన్నారు.

రెండేళ్ల తర్వాత 1000 పరుగుల విరాట్....

గత రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో వరుస వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరైన విరాట్ కొహ్లీ ... రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి 1000 పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు. నెదర్లాండ్స్ తో ముగిసిన ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ లీగ్ పోరులో విరాట్ 44 బంతుల్లో 62 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా వెయ్యి పరుగులు పూర్తి చేయగలిగాడు.

ప్రస్తుత ఏడాదిలో కోహ్లీ మొత్తం 1024 పరుగులు చేసినట్లయ్యింది. 28 మ్యాచ్‌లలో 31 ఇన్నింగ్స్ ఆడి 39.38 సగటుతో 1000 పరుగుల రికార్డు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 9 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యున్నత వ్యక్తిగత స్కోర్‌ 122 నాటౌట్‌. అంతకుముందు 2019లో 1000 పరుగుల మార్క్‌ దాటిన కోహ్లీ.. మళ్లీ 1000 పరుగులు సాధించడం ఇదే కావడం ఓ రికార్డు.

2020, 2021 సీజన్లలో కోహ్లీ పూర్తిగా ఫామ్‌ కోల్పోయాడు. తన స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. 2020 సీజన్లో 842 పరుగులు, 2021లో 964 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

దుబాయ్ వేదికగా కొద్దివారాల క్రితం ముగిసిన 2022 ఆసియాకప్ టోర్నీ ద్వారా విరాట్ కొహ్లీ తిరిగి ఫామ్ ను అందిపుచ్చుకోగలిగాడు.

their next match on November 6.

Tags:    
Advertisement

Similar News