ఆసియా కప్ విజేత శ్రీలంక‌

ఫైనల్ లో పాకిస్తాన్ పై విజయం సాధించి శ్రీలంక ఆసియాకప్ ను చేజిక్కించుకుంది. 171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ ను 23 పరుగుల తేడాతో శ్రీలంక ఓడించింది.

Advertisement
Update: 2022-09-12 02:32 GMT

 ఊహించని విధంగా శ్రీలంక ఆసియా కప్ ను చేజిక్కించుకుంది. ఫైనల్ లో పాకిస్తాన్ ను చిత్తు చేసి విన్నర్ గా నిలిచింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ ను 23 పరుగుల తేడాతో శ్రీలంక ఓడించింది. పాక్ జట్టు 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక త్వరత్వరగానే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే రాజపక్స భారీ సిక్సర్లతో విరుచుకుపడి 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 నాటౌట్ గా నిలిచి అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకోగా, శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది.

171 పరుగుల లక్ష్యంతో ఫీల్డ్ లోకి దిగిన పాకిస్తాన్ ను లంక బౌలర్లు కకావికలం చేశారు. ఓపెనర్ రిజ్వాన్ (55) అర్ధసెంచరీతో రాణించగా, ఇఫ్తికార్ అహ్మద్ 32 పరుగులు చేశాడు. వీరిద్దరు మినహా పాక్ జట్టులో మిగతా వాళ్లందరూ విఫలమయ్యారు. దాంతో పాక్ 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్లలో మధుషాన్ 4, హసరంగ 3, కరుణరత్నే 2, తీక్షణ 1 వికెట్ తీశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో శ్రీలంక ఫీల్డింగ్ అత్యున్నత స్థాయిలో ఉంది.

శ్రీలంకకు ఇది 6వ ఆసియా కప్. ఆసియా కప్ 7 సార్లు సాధించి భారత్ ముందంజలో ఉండగా శ్రీలంక రెండ్వ స్థానంలో నిలిచింది. 1986, 1997, 2004, 2008, 2014లో శ్రీలంక ఆసియాకప్ టైటిల్ సాధించింది.

Tags:    
Advertisement

Similar News