అర్జున అవార్డు అందుకున్న తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్

తెలంగాణ నుంచి స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌తో పాటు టేబుల్ టెన్నిస్‌ ప్లేయర్ ఆకుల శ్రీజ కూడా అర్జున అవార్డు అందుకున్నది.

Advertisement
Update: 2022-11-30 13:20 GMT

భారత స్టార్ బాక్సర్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది క్రీడల్లో ప్రతిభ కనపరిచిన ఆటగాళ్లతో పాటు, అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును క్రీడాశాఖ ప్రకటించింది. ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు టెన్నిస్ లెజెండ్ శరత్ కమాల్, అర్జున అవార్డును 25 మంది క్రీడాకారులకు అందించారు.

తెలంగాణ నుంచి స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌తో పాటు టేబుల్ టెన్నిస్‌ ప్లేయర్ ఆకుల శ్రీజ కూడా అర్జున అవార్డు అందుకున్నది. ఇక రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్‌ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. క్రీడా మంత్రిత్వ శాఖ నవంబర్ 14న ఈ పురస్కారాలను ప్రకటించగా.. ఇవ్వాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరిగింది.

అర్జున అవార్డులు:

సీమా పూనియా (అథ్లెటిక్స్)

ఆల్డస్ పాల్ (అథ్లెటిక్స్)

అవినాష్ సాబుల్ (అథ్లెటిక్స్)

లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్)

హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్)

అమిత్ (బాక్సింగ్)

నిఖత్ జరీన్ (బాక్సింగ్)

భక్తి కులకర్ణి (చెస్)

ఆర్ ప్రజ్ఞానంద (చెస్)

దీప్ గ్రేస్ ఇక్కా (హాకీ)

​​సుశీలా దేవి (జూడో)

సాక్షి కుమారి (కబడ్డీ)

నయన్ మోని సైకియా (లోన్‌బాల్)

సాగర్ ఓవల్కర్ (మల్కాంబ్)

ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్)

ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్)

శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్)

వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్)

అన్షు (రెజ్లింగ్)

సరిత (రెజ్లింగ్)

పర్వీన్ (వుషు)

మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్)

తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్)

స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్)

జెర్లిన్ అనికా జె (చెవిటి బ్యాడ్మింటన్)

ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్):

జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ)

మహ్మద్ అలీ కమర్ (బాక్సింగ్)

సుమా షిరూర్ (పారా-షూటింగ్)

సుజిత్ మాన్ (రెజ్లింగ్)

జీవితకాల పురస్కారం:

దినేష్ లాడ్ (క్రికెట్)

బిమల్ ఘోష్ (ఫుట్‌బాల్)

రాజ్ సింగ్ (రెజ్లింగ్)

ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు:

అశ్విని అక్కుంజీ (అథ్లెటిక్స్)

ధరమ్‌వీర్ సింగ్ (హాకీ)

​​బిసి సురేష్ (కబడ్డీ)

నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్)

నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ అవార్డు:

ట్రాన్స్ స్టేడియా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్

కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

లడఖ్ స్కీ అండ్ స్నోబోర్డ్ అసోసియేషన్

Tags:    
Advertisement

Similar News