Samsung Galaxy S23 Ultra | మ‌రో 2 క‌ల‌ర్స్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా ప్రీమియం ఫోన్‌.. ధ‌రెంతంటే?

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 సిరీస్‌లో.. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 (Samsung Galaxy S23) , శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 + (Samsung Galaxy S23+) తోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా (Samsung Galaxy S23 Ultra) ఫోన్లు నాలుగు రంగుల్లో భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Advertisement
Update: 2023-06-22 01:15 GMT

Samsung Galaxy S23 Ultra | మ‌రో 2 క‌ల‌ర్స్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా ప్రీమియం ఫోన్‌.. ధ‌రెంతంటే?

ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్ మేజ‌ర్ శాంసంగ్‌.. త‌న ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా మోడ‌ల్.. మ‌రో రెండు క‌ల‌ర్స్‌లో మార్కెట్‌లోకి తెచ్చింది. ప్ర‌త్యేకంగా శాంసంగ్ వెబ్‌సైట్‌, శాంసంగ్ ఆఫ్‌లైన్ స్టోర్ల‌లో మాత్ర‌మే ల‌భిస్తాయి. ఇంత‌కుముందు శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 సిరీస్‌లో.. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 (Samsung Galaxy S23) , శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 + (Samsung Galaxy S23+) తోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా (Samsung Galaxy S23 Ultra) ఫోన్లు నాలుగు రంగుల్లో భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. ఈ ఫోన్లు క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 8 జెన్ 2 ఎస్వోసీ చిప్‌సెట్ క‌లిగి ఉంటాయి. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ విత్ 45 వాట్ల వైర్డ్/ 15వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ కలిగి ఉంటుంది.

ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా (Samsung Galaxy S23 Ultra) ఫోన్లు ఎక్స్‌క్లూజివ్‌గా లైట్ బ్లూ, రెడ్ వేరియంట్ల‌లో ల‌భ్యం అవుతాయి. శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌, శాంసంగ్ ఆఫ్‌లైన్ స్టోర్ల‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి. కంపెనీ వెబ్‌సైట్‌లో గ్రాఫైట్‌, లైమ్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తాయి. ఫాంట‌మ్ బ్లాక్‌, క్రీమ్‌, గ్రీన్‌, లావెండ‌ర్ క‌ల‌ర్స్ ఆప్ష‌న్ల‌లో ఈ సిరీస్ ఫోన్లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఆఫ్‌లైన్ స్టోర్ల‌లో సొంతం చేసుకోవ‌చ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా (Samsung Galaxy S23 Ultra) ఫోన్ 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.1,24,999, 12 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.1,34,999, 12 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ (టీబీ) ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.1,54,999ల‌కు ల‌భిస్తుంది.

6.8 అంగుళాల హెడ్జ్ క్యూహెచ్‌డీ + డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌, ట‌చ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్ క‌లిగి ఉంటుంది. డ్యుయ‌ల్ నానో సిమ్ స‌పోర్టెడ్ స్మార్ట్ ఫోన్ ఓక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగ‌న్ 8 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 విత్ వ‌న్ యూఐ 5.1 స్కిన్ వ‌ర్ష‌న్ మీద ప‌ని చేస్తుంది.

క్వాడ్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తున్న గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా ఫోన్ 200-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ వైడ్ సెన్స‌ర్‌, 12-మెగా పిక్సెల్ సెన్స‌ర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్‌, రెండు 10-మెగా పిక్సెల్ సెన్స‌ర్స్ విత్ టెలిఫొటో లెన్స్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా కూడా ఉంటుంది.

గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా ఫోన్‌తోపాటు ఎస్ పెన్ స్టైల‌స్ ఆఫ‌ర్ చేస్తున్న‌ది శాంసంగ్‌. ఈ ఫోన్ 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News