తక్కువ ధరలో వన్‌ప్లస్ ట్యాబ్!

OnePlus Tablet price: వన్‌ప్లస్ ప్యాడ్ వచ్చే ఏడాది మొదట్లో లాంఛ్ అవుతుందని సంస్థ ప్రకటించింది. వన్‌ప్లస్ ప్యాడ్ ధర సుమారు రూ. 20వేల లోపు ఉంటుందని అంచనా.

Advertisement
Update: 2022-11-18 12:50 GMT

తక్కువ ధరలో వన్‌ప్లస్ ట్యాబ్!

ప్రీమియం, మిడ్ రేంజ్ ఫోన్లతో ఇండియాలో మంచి మార్కెట్‌ను సాధించిన చైనీస్ మొబైల్ బ్రాండ్ వన్‌ప్లస్.. త్వరలోనే ఆండ్రాయిడ్ ట్యా్బ్‌ను తీసుకొస్తోంది.'వన్‌ప్లస్ ప్యాడ్' పేరుతో రిలీజ్ అవ్వనున్న ఈ టాబ్లెట్ ఫీచర్లేంటంటే..

వన్‌ప్లస్ ప్యాడ్ వచ్చే ఏడాది మొదట్లో లాంఛ్ అవుతుందని సంస్థ ప్రకటించింది. అయితే ఈ ప్యాడ్‌ మొదటగా ఇండియన్ మార్కెట్‌లోనే రిలీజ్ అవ్వనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న రెడ్‌మీ ప్యాడ్, షియోమి ప్యాడ్ , శాంసంగ్ ప్యాడ్‌లకు ఈ వన్‌ప్లస్ ప్యాడ్ గట్టి పోటీ ఇవ్వనుంది. వన్‌ప్లస్ ప్యాడ్ ధర సుమారు రూ. 20వేల లోపు ఉంటుందని అంచనా.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ టాబ్లెట్ 12.4-అంగుళాల ఫుల్ హెచ్‌డీ, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో రానుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌పై రన్ అవుతుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో వస్తుంది. ఇది లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 10,090 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. టాబ్‌లో వెనుకవైపు13-ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8-ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News