పిల్లల స్క్రీన్ టైం తగ్గించేలా ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్!

ఇటీవల రోజుల్లో ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో ఇన్‌స్టాగ్రామ్ వాడకం బాగా ఎక్కువైంది. దీంతో పిల్లల ఇన్‌స్టాగ్రామ్ వాడకాన్ని తగ్గించేందుకు మెటా సంస్థ ‘నైట్ టైం నడ్జెస్’ అనే ఓ కొత్త టూల్‌ను తెచ్చింది.

Advertisement
Update: 2024-01-23 04:00 GMT

ఇటీవల రోజుల్లో ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో ఇన్‌స్టాగ్రామ్ వాడకం బాగా ఎక్కువైంది. దీంతో పిల్లల ఇన్‌స్టాగ్రామ్ వాడకాన్ని తగ్గించేందుకు మెటా సంస్థ ‘నైట్ టైం నడ్జెస్’ అనే ఓ కొత్త టూల్‌ను తెచ్చింది. ఇదెలా పనిచేస్తుందంటే..

టీనేజ్ పిల్లలు, యువతలో చాలామంది రాత్రిళ్లు నిద్ర పోకుండా సోషల్ మీడియాలో గడుపుతుంటారు. దీన్ని కట్టడి చేసేందకుగానూ ఇన్‌స్టాగ్రామ్.. ‘నైట్ టైం నడ్జెస్’ అనే ఫీచర్ ప్రవేశపెట్టింది. రాత్రిళ్లు స్క్రీన్ టైంను తగ్గించేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా సుమారు ఐదు వందల కోట్ల మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఉన్నారు. ఇందులో టీనేజ్, యంగ్ ఏజ్‌లో ఉన్నవాళ్లే ఎక్కువ. అయితే ముఖ్యంగా చిన్నపిల్లల ప్రైవసీ, సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని వారి స్క్రీన్ టైంను తగ్గించేవిధంగా ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పిల్లల మొబైల్ వాడకాన్ని కొంతవరకూ కంట్రోల్ చేసుకునే వీలుంటుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నైట్‌ టైం నడ్జెస్‌’ ఫీచర్‌‌ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ప్రతీ పది నిమిషాలకోసారి నోటిఫికేషన్స్ వస్తాయి. . దీని ద్వారా పిల్లలు అర్థరాత్రి వరకు యాప్‌ను ఉపయోగించకుండా చూసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే లేట్ నైట్ టైంలో ప్రతి పది నిమిషాలకోసారి యాప్ క్లోజ్ చేయమని నోటిఫికేషన్ వస్తుంది. అదేపనిగా రీల్స్ చూసేవాళ్లకు నిద్ర పోవాలని గుర్తు చేసేలా ఈ ఫీచర్ ఉపయోగపడొచ్చు.

Tags:    
Advertisement

Similar News