Artificial intelligence - Bill Gates | పైస కొద్దీ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌.. కృత్రిమ మేధ‌పై బిల్‌గేట్స్ అంచ‌నాలివి..!

Artificial intelligence - Bill Gates | టెక్నాల‌జీ రంగంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) స‌మూల మార్పులు తెస్తుందా?.. రోబోలు `ఏజెంట్లు`గా ప‌ని చేస్తాయా..? అంటే అవున‌నే అంటున్నారు మైక్రోసాఫ్ట్ (Microsoft) కో-ఫౌండ‌ర్ బిల్ గేట్స్ (Bill Gates).

Advertisement
Update: 2023-11-16 04:45 GMT

Artificial intelligence - Bill Gates | పైస కొద్దీ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌.. కృత్రిమ మేధ‌పై బిల్‌గేట్స్ అంచ‌నాలివి..!

Artificial intelligence - Bill Gates | టెక్నాల‌జీ రంగంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) స‌మూల మార్పులు తెస్తుందా?.. రోబోలు `ఏజెంట్లు`గా ప‌ని చేస్తాయా..? అంటే అవున‌నే అంటున్నారు మైక్రోసాఫ్ట్ (Microsoft) కో-ఫౌండ‌ర్ బిల్ గేట్స్ (Bill Gates). ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ విష‌య‌మై ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కృత్రిమ మేధ (Artificial intelligence) వ‌ల్ల వ‌చ్చే ఐదేండ్ల‌లో ప్ర‌తి ఒక్క‌రికి వారి ఈ-మెయిల్ ఆధారంగా ఒక ఏఐ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ (AI Personal Assistant) ఉంటుంద‌ని, అది వారికి రోబో `ఏజెంట్‌`గా ప‌ని చేస్తుంద‌న్నారు. వ‌చ్చే ఐదేండ్ల‌లో ప్ర‌పంచంలో స‌మూల మార్పులు వ‌చ్చేస్తాయ‌ని తేల్చి చెప్పారు. ఏఐ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్లు స్మార్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తాయి. అడ‌గ‌క ముందే మీకు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వ‌గ‌ల చురుకైన సామ‌ర్థ్యం క‌లిగి ఉంటాయి అని బిల్ గేట్స్ (Bill Gates) కుండ బ‌ద్ధ‌లు కొట్టారు.

`ఇక ముందు ఏం చేయాల‌న్నా, ప్ర‌తి ఒక్క‌రూ ఈ-మెయిల్ ఆధారిత ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ క‌లిగి ఉంటారు. కృత్రిమ మేధ టెక్నాల‌జీతో రూపుదిద్దుకున్న ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ త‌న యూజ‌ర్ల‌కు అవ‌స‌ర‌మైనవ‌న్నీ స‌మ‌కూరుస్తుంది. మీ ఆస‌క్తి, సాహ‌స ప్ర‌వృత్తిని బ‌ట్టి మీకు సిఫార‌సులు చేస్తుంది. మీరు ఆనందించ‌డానికి అనువైన రెస్టారెంట్ల‌లో రిజ‌ర్వేష‌న్లు బుక్ చేస్తుంది. మీరు పూర్తిగా వ్య‌క్తిగ‌తంగా ప్లానింగ్ చేసుకోవాల‌ని భావిస్తే, మీరు ట్రావెల్ ఏజెంట్‌కు మ‌నీ పే చేయ‌డంతోపాటు ఎంత స‌మ‌యం గ‌డుపుతావో వెల్ల‌డించాల్సి ఉంటుంది` అని బిల్ గేట్స్ పేర్కొన్నారు.

ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ (OpenAI ChatGPT), మైక్రోసాఫ్ట్ బింగ్ (Microsoft Bing), గూగుల్ బార్డ్ (Google Bard), ఎల‌న్‌మ‌స్క్ గ్రూక్ (Elon Musk Grok) వంటి న్యూ ప్లాట్‌ఫామ్స్ ఆవిష్క‌ర‌ణ‌తో అధునాత‌న ఏఐ టెక్నాల‌జీ ఆవిర్భ‌విస్తున్న ద‌శ‌లో బిల్‌గేట్స్ (Bill Gates) వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ప్రొడ‌క్టివిటీ టూల్స్ కంటే ఎక్కువగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ టూల్స్ (AI tools) ప‌ని చేస్తాయ‌ని కూడా బిల్‌గేట్స్ (Bill Gates) తేల్చేశారు. ఒక‌వేళ మీరు బిజినెస్ కోసం ఐడియా క‌లిగి ఉంటే, ఆ బిజినెస్ ప్లాస్ రాయ‌డంలో ఏఐ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ మీకు సాయ ప‌డుతుంది. అందుకోసం ఒక ప్రెజెంటేష‌న్ క్రియేట్ చేస్తుంది. మీరు ఇష్ట‌ప‌డే ఇమేజ్‌లు కూడా త‌యారు చేస్తుంది అని బిల్ గేట్స్ తెలిపారు.

`కంపెనీ యాజ‌మాన్యాలు ప్ర‌తి స‌మావేశంలోనూ త‌లెత్తే ప్ర‌శ్న‌ల‌కు నేరుగా స‌మాధానంగా ఇవ్వ‌డానికి ఏజెంట్ల‌ను ఏర్పాటు చేసుకుంటాయి. ఏజెంట్ల బిజినెస్ లేకుండా ఏ ఒక్క కంపెనీ ఎదుగుద‌ల లేదు. భ‌విష్య‌త్‌లో ధ‌ర‌పై ఏఐ ఏజెంట్లు ల‌భిస్తాయి. ఈ ఏడాది `ఏఐ`తో ప‌ని ప్రారంభిస్తే, పోటీ ఏర్ప‌డిన‌ప్పుడు అసాధార‌ణ మొత్తంలో ఫీజు చెల్లించాలి. దీంతో ఏఐ ఏజెంట్లు మ‌రింత పిరంగా మారిపోతాయి. మీ జీవితాల‌ను స‌ర‌ళ‌త‌రం చేయ‌డానికి టెక్నాల‌జీ ఉప‌క‌రిస్తుంది` అని బిల్‌గేట్స్ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News