జనవరిలో రికార్డు స్థాయిలో GST వసూళ్లు

"జనవరి 31, 2023 సాయంత్రం 5:00 గంటల వరకు జనవరి నెలలో సేకరించిన స్థూల GST ఆదాయం రూ. 1,55,922 కోట్లు, ఇందులో CGST రూ. 28,963 కోట్లు, SGST రూ. 36,730 కోట్లు, IGST రూ. 79,599 కోట్లు. వస్తువుల దిగుమతులపై 37,118 కోట్లు వసూలు కాగా, సెస్ రూ. 10,630 కోట్లు " అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement
Update: 2023-02-01 02:09 GMT

2023 జనవరిలో వస్తు సేవల పన్ను (GST) రికార్డు స్థాయిలో రూ. 1.56 లక్షల కోట్లు వసూలయ్యి‍ది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. GST వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మూడోసారి రూ. 1.5 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి. 2022 ఏప్రిల్‌లో అత్యధికంగా GST వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు.

"జనవరి 31, 2023 సాయంత్రం 5:00 గంటల వరకు జనవరి నెలలో సేకరించిన స్థూల GST ఆదాయం రూ. 1,55,922 కోట్లు, ఇందులో CGST రూ. 28,963 కోట్లు, SGST రూ. 36,730 కోట్లు, IGST రూ. 79,599 కోట్లు. వస్తువుల దిగుమతులపై 37,118 కోట్లు వసూలు కాగా, సెస్ రూ. 10,630 కోట్లు " అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ వసూళ్ళ రిపోర్ట్ జనవరి 31 సాయంత్రం 5 గంటలవరకే కాబట్టి వసూళ్ళు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెల వరకు వచ్చిన‌ ఆదాయాలు గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన GST ఆదాయాల కంటే 24% ఎక్కువ.

Tags:    
Advertisement

Similar News