బ్రేక్ వేశారు, కానీ.. మిస్త్రీ ప్రమాదంపై మధ్యంతర నివేదిక..

కారులోని ఎలక్ట్రానిక్‌ మాడ్యూల్ ని భారత్ లోని మెర్సిడెజ్ కంపెనీ నిపుణుల బృందం విశ్లేషించింది. రోడ్డు డివైడర్‌ ను ఢీకొనడానికి ఐదు సెకన్ల ముందే కారుకు బ్రేకులు వేసినట్లు వెల్లడించింది.

Advertisement
Update: 2022-09-10 03:35 GMT

సైరస్ మిస్త్రీ ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. కారు ప్రమాదానికి ప్రధాన కారణం ఓవర్ స్పీడ్ అని తెలుస్తున్నా.. వెనుక కూర్చున్న ఇద్దరూ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, వెనకవైపు ఎయిర్ బెలూన్స్ లేకపోవడంతో తీవ్ర గాయాలతో స్పాట్ లోనే మరణించారని ప్రాథమికంగా నిర్థారించారు. కారు ఎలాంటిదైనా, డ్రైవర్ కి నైపుణ్యం లేకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని స్టేట్ మెంట్ ఇచ్చారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ మొత్తం వ్యవహారంలో సైరస్ మిస్త్రీ తర్వాత, మెర్సిడెజ్ బెంజ్ కంపెనీ పేరు అంతలా మారుమోగింది. ప్రమాదంలో బెంజ్ కారు కాస్తా తుక్కుతుక్కుగా మారింది. పైగా విదేశాల్లో అక్కడి నిబంధనల ప్రకారం వెనక సీట్లకు కూడా ఎయిర్ బెలూన్లు తప్పనిసరి చేసే కంపెనీలు భారత్ లో మాత్రం ఆ నిబంధన ఎందుకు పాటించవనే చర్చ కూడా వచ్చింది. దీంతో బెంజ్ కంపెనీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. నిపుణుల బృందం హాంకాంగ్ నుంచి ముంబై బయలుదేరింది. ఈలోగా ఓ మధ్యంతర నివేదికను ఇక్కడి నిపుణులు రూపొందించారు.

గుట్టు విప్పిన ఎలక్ట్రానిక్ మాడ్యూల్..

కారులోని ఎలక్ట్రానికి మాడ్యూల్ ని భారత్ లోని మెర్సిడెజ్ కంపెనీ నిపుణుల బృందం విశ్లేషించింది. రోడ్డు డివైడర్‌ ను ఢీకొనడానికి ఐదు సెకన్ల ముందే కారుకు బ్రేకులు వేసినట్లు వెల్లడించింది. ప్రమాదం జరగడానికి కొన్ని సెకన్ల ముందు కారు 100 కి.మీ. వేగంలో ఉన్నట్లు తెలిపింది. డివైడర్‌ ను ఢీకొన్న సమయంలో కారు వేగం 89 కి.మీ. అని వెల్లడించింది. దుర్ఘటన జరగడానికి 5 సెకన్ల ముందు బ్రేకులు వేసినా ఫలితం లేకుండా పోయిందని కారు డివైడర్ ని ఢీకొందని.. పోలీసులకు ఇచ్చిన మధ్యంతర నివేదికలో పేర్కొన్నారు.

ఇక పూర్తి స్థాయి నివేదిక కోసం హాంకాంగ్ నుంచి మరో నిపుణుల బృందం వస్తోంది. సోమవారం ఈ బృంద సభ్యులు ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్తారు, కారుని పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తారు. కారు ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో అధికారులకు సహకరిస్తున్నామని జర్మనీ నుంచి మెర్సిడెస్‌ బెంజ్‌ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

Tags:    
Advertisement

Similar News