'మోడీ హఠావో, దేశ్ బచావో' పోస్టర్లు వేసినందుకు 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

డిడియు మార్గ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) ప్రధాన కార్యాలయం నుండి ఐపి ఎస్టేట్ వరకు దాదాపు 2 వేల పోస్టర్లను తొలగించామని పోలీసులు తెలిపారు. పోస్టర్లతో కూడిన ఓ వ్యాన్ ను కూడా స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.

Advertisement
Update: 2023-03-22 07:51 GMT

ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు అతికించినందుకు ఢిల్లీ పోలీసులు కనీసం 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని అధికారులు బుధవారం తెలిపారు.

దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో గోడలు, స్తంభాలపై “మోడీ హఠావో, దేశ్ బచావో” (మోడీని తొలగించండి, దేశాన్ని రక్షించండి) అని రాసి ఉన్న పోస్టర్‌లు వెలిశాయి.

డిడియు మార్గ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) ప్రధాన కార్యాలయం నుండి ఐపి ఎస్టేట్ వరకు దాదాపు 2 వేల పోస్టర్లను తొలగించామని పోలీసులు తెలిపారు. పోస్టర్లతో కూడిన ఓ వ్యాన్ ను కూడా స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించి రెండు ప్రింటింగ్ ప్రెస్‌ల యజమానులతో సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు అతికించినందుకు సంబంధించి పోలీసులు 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ప్రత్యేక పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) దేపేంద్ర పాఠక్ ధృవీకరించారు.

Tags:    
Advertisement

Similar News