దేశంలో కరోనా అలర్ట్.... ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం

Coronavirus in India: సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో దేశంలో కోవిడ్ కేసుల పరిస్థితి, మరోసారి కొవిడ్ తీవ్రరూపు దాల్చకుండా తీసుకోవాల్సిన చర్యలు, వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రజారోగ్య వ్యవస్థలను సన్నద్ధం చేయాల్సిన తీరుపై ప్రధాని చర్చించనున్నారు.

Advertisement
Update: 2023-03-22 10:54 GMT

Coronavirus in India: దేశంలో కరోనా అలర్ట్.... ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం

భారత్ లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా నిత్యం 1000కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోడీ మరికొద్ది సేపట్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో దేశంలో కోవిడ్ కేసుల పరిస్థితి, మరోసారి కొవిడ్ తీవ్రరూపు దాల్చకుండా తీసుకోవాల్సిన చర్యలు, వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రజారోగ్య వ్యవస్థలను సన్నద్ధం చేయాల్సిన తీరుపై ప్రధాని  చర్చించనున్నారు.

కాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,134 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వల్ల‌ తాజాగా చత్తీస్ గఢ్, కేరళ, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఒక్కో మరణం నమోదయ్యాయి.ప్రస్తుతం దేశంలో 7,026 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Tags:    
Advertisement

Similar News