అక్కడ బీజేపీ అభ్యర్థికి పోలైనవి 40 ఓట్లే.. ఉపఎన్నికల్లోనూ బీజేపీ చిత్తు చిత్తు

షిన్‌షార్ తబాహ్‌కు 16,679 ఓట్లు పోలవగా, సామ్లింగ్ మాల్న్‌జియాంగ్‌కు 13,176 ఓట్లు వచ్చాయి. అయితే అక్కడ బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి సెరాప్త్ ఎరిక్‌కి కేవలం 40 ఓట్లే రావడం గమనార్హం. మొత్తం పోలైన ఓట్లలో ఇవి 0.12 శాతం ఓట్లు మాత్రమే.

Advertisement
Update: 2023-05-13 11:39 GMT

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. బీజేపీ సర్కారు అవినీతిని కర్ణాటక ప్రజలు ఈసడించుకున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టిన వారికి తమ ఓటుతో సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే.. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే అప్పట్లో ఈస్ట్ ఖాసీ హిల్స్‌లో ఉన్న సోహియాంగ్ అసెంబ్లీ స్థానం నుంచి యూడీపీ అభ్యర్థిగా హెచ్‌డీఆర్ లింగ్డో బరిలో నిలిచారు. అయితే పోలింగ్‌కు ముందే ఆయన చనిపోవడంతో ఎలక్షన్ కమిషన్ అక్కడ ఎన్నికలు వాయిదా వేసింది.

తాజాగా నిర్వహించిన ఎన్నికకు సంబంధించి ఇవాళ కౌంటింగ్ నిర్వహించారు. అయితే ఆ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)కి షాక్ ఇస్తూ యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) విజయం సాధించింది. యూడీపీ అభ్యర్థి షిన్‌షార్ లింగ్డో తబాహ్ చేతిలో ఎన్‌పీపీ అభ్యర్థి సామ్లింగ్ మాల్న్‌జియాంగ్ 3,400 ఓట్ల పరాజయం పాలయ్యారు. షిన్‌షార్ తబాహ్‌కు 16,679 ఓట్లు పోలవగా, సామ్లింగ్ మాల్న్‌జియాంగ్‌కు 13,176 ఓట్లు వచ్చాయి. అయితే అక్కడ బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి సెరాప్త్ ఎరిక్‌కి కేవలం 40 ఓట్లే రావడం గమనార్హం. మొత్తం పోలైన ఓట్లలో ఇవి 0.12 శాతం ఓట్లు మాత్రమే.

కాంగ్రెస్ కంచుకోట బద్దలు కొట్టిన ఆప్..

పంజాబ్‌లోని జలంధర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. ఈ స్థానం నుంచి ఆప్ తరపున రింకూ సింగ్, కాంగ్రెస్ నుంచి కరమ్‌జిత్ కౌర్ చౌదరి పోటీ చేశారు. రింకూకు 3,02,097ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థికి 2,43,450 ఓట్లు వచ్చాయి. శిరోమణి అకాలీదళ్‌ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి 1,58,354 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. 1,34,706 ఓట్లతో బీజేపీ అభ్యర్థి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఎన్నాళ్ల నుంచో జలంధర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నది. పాతికేళ్ల తర్వాత జలంధర్‌లో కాంగ్రెసేతర అభ్యర్థి గెలిచి రికార్డు సృష్టించారు. జనవరిలో జరిగిన భారత్ జోడో యాత్ర సమయంలో జలంధర్ ఎంపీ సంతోక్ సింగ్ గుండె పోటుతో మృతి చెందారు. దీంతో ఇక్కడ మే 10న ఉప ఎన్నిక నిర్వహించారు.

జార్సుగూడలో బీజేడీ విజయం..

ఒడిషాలోని జార్సుగూడ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజూ జనతాదళ్ అభ్యర్థి దీపాలి దాస్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి తంకధార్ త్రిపాఠిపై 48,477 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీపాలి దాస్‌కు 1,07,198 ఓట్లు పోలవగా.. తంకధార్ త్రిపాఠికి 58,477 ఓట్లు వచ్చాయి.

Tags:    
Advertisement

Similar News