ఆసియాలోని టాప్ 8 కలుషిత నగరాలు మనదేశంలోనివే...కాలుష్యం లేనినగరం రాజమండ్రి మాత్రమే

ఆసియాలోని అత్యంత కలుషిత నగరాల్లోని టాప్ 10 లో మొదటి 8 నగరాలు మనదేశంలో ఉండగా, టాప్ 10 అత్యుత్తమ ఎయిర్ క్వాలిటీ నగరాల్లో భారత దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం మాత్రమే ఉండటం విశేషం.

Advertisement
Update: 2022-10-24 06:36 GMT

ఆసియాలోని అత్యంత కలుషిత నగరాల్లోని టాప్ 10 లో మొదటి 8 నగరాలు భారత్ లోనే ఉన్నాయని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది.

వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తాజా డేటా ప్రకారం,గురుగ్రామ్,రేవారి,ముజఫర్‌పూర్ సమీపంలోని ధరుహేరా, లక్నో దగ్గర్లోని తాల్కోర్, డీఆర్ సీసీ ఆనంద్ పూర్ (బెగుసరాయ్) , భోపాల్ ఛౌరాహా(దేవాస్) , ఖడక్ పాడ(కళ్యాణ్), దర్శన్ నగర్(చప్రా) నగరాలు టాప్ 8 జాబితాలో ఉన్నాయి.

కాగా టాప్ 10 అత్యుత్తమ ఎయిర్ క్వాలిటీ నగరాల్లో భారత దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం మాత్రమే ఉండటం విశేషం.

చలికాలంలో వాయు కాలుష్య స్థాయిలు పెరుగుతాయని సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR)-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) నిపుణులు తెలిపారు.

వాయు కాలుష్యం నవజాత శిశువులలో, చిన్నపిల్లలలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని 90% కంటే ఎక్కువ మంది పిల్లలు ప్రతిరోజూ విషపూరితమైన గాలిని పీల్చుకుంటున్నారు. కలుషితమైన గాలిని పీల్చే గర్భిణీ స్త్రీలు నెలలు నిండకుండానే ప్రసవించవచ్చు, తక్కువ బరువుతో పిల్లలు పుట్టవచ్చు. వాయు కాలుష్యం నాడీ అభివృద్ధిపై ప్రభావితం చూపిస్తుంది, ఉబ్బసం, క్యాన్సర్‌ను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులపై ఎక్కువ ప్రభావం చూయిస్తుంది.

Tags:    
Advertisement

Similar News