ముద్దు అడిగితే ఇవ్వనన్న ఎయిర్ హోస్టెస్.. కొట్టి బలవంతంగా పెట్టిన‌ ప్యాసింజర్

ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత అదే ఎయిర్ హోస్టెస్ వచ్చి అలన్ బర్క్ కు రెడ్ వైన్ సర్వ్ చేసింది. ఆ తర్వాత అతడు మద్యం మత్తులోకి జారుకున్నాడు. మెలకువ వచ్చిన తర్వాత మళ్లీ ఎయిర్ హోస్టెస్ ని పిలిచాడు.

Advertisement
Update: 2023-04-22 11:47 GMT

విమానాల్లో ఇటీవల జరుగుతున్న సంఘటనలు జనాన్ని బిత్తరపోయేలా చేస్తున్నాయి. విమానాల్లో ప్ర‌యాణికులు ఫుల్ గా తాగి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వింత ప్రవర్తనకు బిత్తరపోతున్న విమాన సంస్థలు ఎప్పుడు లేని విధంగా కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నాయి. తాజాగా అమెరికాలో డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఒక ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు. ఎయిర్ హోస్టెస్ ని ముద్దు అడిగాడు. ఇవ్వలేదని కొట్టాడు. ఆ తర్వాత బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

మిన్నెయా పోలిస్ నుంచి అంకో రేజ్ కు డెల్టా ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. ఇందులో అమెరికాలోని టెక్సాస్ నగరానికి చెందిన డేవిడ్ అలన్ బర్క్ (61) ప్రయాణించాడు. ఫ్లైట్ ఎక్కగానే తనకు రెడ్ వైన్ కావాలని ఎయిర్ హోస్టెస్ ని అడిగాడు. ఫ్లైట్ టేకాఫ్ కాకముందే వైన్ సర్వ్ చేయడం కుదరదని ఆమె చెప్పింది.

ఆ తర్వాత ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత అదే ఎయిర్ హోస్టెస్ వచ్చి అలన్ బర్క్ కు రెడ్ వైన్ సర్వ్ చేసింది. ఆ తర్వాత అతడు మద్యం మత్తులోకి జారుకున్నాడు. మెలకువ వచ్చిన తర్వాత మళ్లీ ఎయిర్ హోస్టెస్ ని పిలిచాడు. ఆమె వచ్చిన తర్వాత ముద్దు పెట్టాలని కోరాడు. అందుకు ఆమె తిరస్కరించింది. దీంతో అలన్ బర్క్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెనుదిరిగి వెళ్తున్న ఎయిర్ హోస్టెస్ నడుము గట్టిగా పట్టుకొని మెడపై ముద్దు పెట్టుకున్నాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడంతో కొట్టాడు.

ఫ్లైట్ కెప్టెన్ కు మీల్స్ తీసుకెళ్తున్న ట్రేలోని ప్లేట్ ను విరగొట్టాడు. జరిగిన ఘటనపై ఫ్లైట్ కెప్టెన్ డెల్టా ఎయిర్ లైన్స్ కు, లా ఎన్‌ఫోర్స్ మెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో విమానం అంకోరేజ్ కు చేరుకోగానే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అలన్ బర్క్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    
Advertisement

Similar News