రివర్స్‌ వాకింగ్‌తో బరువు తగ్గొచ్చు

Reverse Walking for Weight Loss: వాకింగ్ చేయడం మంచి వ్యాయామం అని మనకు తెలుసు. అయితే ముందుకి కాకుండా వెనక్కి నడవడం వల్ల ఇంకా ఎక్కువ లాభాలున్నాయంటున్నారు ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్.

Advertisement
Update: 2022-12-06 10:27 GMT

రివర్స్‌ వాకింగ్‌తో బరువు తగ్గొచ్చు

వాకింగ్ చేయడం మంచి వ్యాయామం అని మనకు తెలుసు. అయితే ముందుకి కాకుండా వెనక్కి నడవడం వల్ల ఇంకా ఎక్కువ లాభాలున్నాయంటున్నారు ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్. రివర్స్ వాకింగ్ వల్ల ఎన్ని లాభాలున్నాయంటే..

రివర్స్ డైరెక్షన్‌లో నడవడం మంచి కార్డియో వ్యాయామంగా పనిచేస్తుందని చాలా స్టడీల్లో తేలింది. ఇది బరువు తగ్గడంలో సాయపడటమే కాకుండా గుండె, మానసిక సమస్యలను తగ్గిస్తుందట.అంతేకాదు, వెనక్కి వంద అడుగులు నడిస్తే.. ముందుకి వెయ్యి అడుగులు వేసినంత లాభం ఉంటుందట.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు రివర్స్ వాకింగ్ ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చని తేలింది. వెనక్కి నడవడం వల్ల మోకాలిపై తక్కువ ఒత్తిడి పడుతుంది. రివర్స్ వాకింగ్ చేయడం వల్ల కాలి వెనుకవైపు ఉండే కండరాలు గట్టిపడతాయి. అలాగే వెన్నునొప్పి నుంచి కూడా రిలీఫ్ పొందొచ్చు.

రోజూ పావుగంట సేపు రివర్స్ వాకింగ్ లేదా రివర్స్ జాగింగ్ చేయడం వల్ల రెగ్యులర్ వాకింగ్ కంటే ఎక్కువ క్యాలరీలు కరిగించొచ్చు. తరచూ ఈ ఎక్సర్​సైజ్ చేయడం వల్ల ఒకటిరెండు నెలల్లోనే శరీర బరువులో కూడా తేడా వస్తుంది.

రివర్స్ వాకింగ్ వల్ల ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి మానసిక సమస్యలు కూడా తగ్గుతాయని డాక్టర్లు చెప్తున్నారు. రివర్స్​ వాకింగ్​ వల్ల బ్రెయిన్​కి, బాడీకి మధ్య కో ఆర్డినేషన్ మెరుగుపడుతుంది

గర్భిణులు, వృద్ధులు రివర్స్‌ వాకింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మెల్లగా నడుస్తూ అలవాటు చేసుకోవాలి. రివర్స్ వాకింగ్‌ను ట్రెడ్ మిల్‌పై కూడా ట్రై చేయొచ్చు. అయితే తక్కువ స్పీడ్‌తో మెల్లగా మొదలుపెట్టి ట్రై చేయాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే జారిపడే ప్రమాదం ఉంది.

Tags:    
Advertisement

Similar News