రాత్రిళ్లు లేట్‌గా పడుకోవడం వల్ల కలిగే నష్టాలివే!

రాత్రిళ్లు లేట్‌గా పడుకుని ఉదయాన్నే లేట్‌గా నిద్ర లేవడం వల్ల శరీరంలోని బయో క్లాక్ దెబ్బతింటుంది. ఇది హార్మోనల్ ఇంబాలెన్స్‌కు దారితీస్తుంది.

Advertisement
Update: 2024-02-11 06:30 GMT

అర్థరాత్రి వరకూ సోషల్ మీడియాలో ఉంటూ లేట్‌గా నిద్రపోయే అలవాటు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. ఈ తరహా లైఫ్‌స్టైల్ వల్ల పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రాత్రిళ్లు లేట్‌గా పడుకోవడం వల్ల శరీరంలో ఏ జరుగుతుందంటే.

అర్థరాత్రి వరకూ మెలకువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు ఉండడమే కాక పలు మానసిక సమస్యలకు కూడా ఈ అలవాటు దారి తీస్తుందట.

రాత్రిళ్లు లేట్‌గా పడుకుని ఉదయాన్నే లేట్‌గా నిద్ర లేవడం వల్ల శరీరంలోని బయో క్లాక్ దెబ్బతింటుంది. ఇది హార్మోనల్ ఇంబాలెన్స్‌కు దారితీస్తుంది. తద్వారా పలు జబ్బులతో పాటు ఒత్తిడి, డిప్రెషన్ వంటివి పెరుగుతాయి. జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. ఏకాగ్రత, ప్రొడక్టివిటీ తగ్గుతాయి.

రాత్రిళ్లు లేట్‌గా పడుకోవడం వల్ల పొట్ట ఉబ్బరం, మలబద్ధకం కడుపునొప్పి వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువని రీసెర్చ్‌లు చెప్తున్నాయి.

లేట్‌గా పడుకోవడం వల్ల వెంటనే బరువు పెరుగుతారట. సమయానికి నిద్ర పోకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్‌ అనే స్ట్రెస్ హార్మోన్‌ లెవల్స్ పెరుగుతాయి. దీనివల్ల ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు మొదలవుతాయి. తద్వారా మెటబాలిజం తగ్గి బరువు పెరగడం మొదలవుతుంది.

మిడ్ నైట్ వరకూ లేచి ఉండడం వల్ల ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. బద్ధకం, అలసట వంటివి మొదలవుతాయి. తద్వారా రోజంతా యాక్టివ్‌గా ఉండలేరు. సాధారణ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువకాలం పాటు బాధిస్తాయి.

మిడ్ నైట్ వరకూ లేచి ఉండేవాళ్లకు దాని ఎఫెక్ట్ వయసుతోపాటు తెలుస్తుంది. వయసు ముప్ఫై దాటిన తర్వాత శరీర పనితీరులో మార్పు వస్తుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తపడడం మంచిది.

రాత్రి 10 గంటలకల్లా పడుకోవడం, పడుకోవడానికి రెండు గంటల ముందే ఆహారాన్ని తినేయడం, నిద్రపోయే గంట ముందు ఫోన్‌ను పక్కనపెట్టేయడం వంటివి అలవాటు చేసుకోవాలి. త్వరగా నిద్ర పట్టడం కోసం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, పాలు తాగడం వంటివి అలవాటు చేసుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News