వయసైపోతున్నా సెలబ్రిటీల్లా మెరిసిపోవాలంటే.. ఇవే చిట్కాలు!

ఆరోగ్యం విషయంలో దాదాపుగా అందరూ సరైన జాగ్రత్తలే తీసుకుంటారు. కానీ, చర్మ ఆరోగ్యం విషయంలో సెలబ్రిటీలకు ఉన్నంత కేర్.. మిగతా వాళ్లకు ఉండదు.

Advertisement
Update: 2024-05-10 08:45 GMT

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ క్రమంగా చర్మం ముడతలు పడుతుంటుంది. వయసైపోతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంటుంది. అయితే సెలబ్రిటీలను చూస్తే మాత్రం దానికి భిన్నంగా ఐదు పదుల వయసులోనూ యంగ్‌గా కనిపిస్తుంటారు. ఇదెలా సాధ్యం? వయసు పెరుగుతున్నా యంగ్‌గా కనిపించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యం విషయంలో దాదాపుగా అందరూ సరైన జాగ్రత్తలే తీసుకుంటారు. కానీ, చర్మ ఆరోగ్యం విషయంలో సెలబ్రిటీలకు ఉన్నంత కేర్.. మిగతా వాళ్లకు ఉండదు. వృత్తి రీత్యా వాళ్లు చర్మ సౌందర్యంపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. అందుకే వాళ్లు వయసైపోతున్నా అందంగానే కనిపిస్తారు. అయితే ఇలా మెయింటెయిన్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కొన్ని సింపుల్ చిట్కాలతో మధ్య వయసులోకూడా అందంగా కనిపించొచ్చు. అదెలాగంటే..

చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో నీటి శాతం ఎక్కువగా ఉండాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారాన్ని డైట్‌లో తప్పక చేర్చుకోవాలి. ఈ రూల్ పాటిస్తే చర్మం ఎప్పుడూ తాజాగా కనిపిస్తుంది. నీటిశాతం ఉన్న ఆహారాలంటే కూరగాయలు, పండ్లు. యాంటీఆక్సిడెంట్లు ఉండే ఫుడ్స్ అంటే అంటే ఆకుకూరలు, బెర్రీలు, హెర్బల్ టీలు.

చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన జాగ్రత్త.. డైట్‌లో జంక్ ఫుడ్స్‌ లేకుండా చూసుకోవడం. జంక్‌ను తగ్గించి చేపలు, నట్స్ వంటి హెల్దీ ఫ్యాట్స్‌ చేర్చుకోవాలి. చర్మ సౌందర్యానికి కొవ్వులు చాలా ముఖ్యం.

ఇక చర్మ సౌందర్యంలో మరో ముఖ్యమైన అంశం శుభ్రత. చర్మంలోని మృతకణాలను తరచూ క్లీన్ చేస్తుండాలి. దీనికోసం కాఫీపొడి లేదా ముల్తానీ మట్టితో మూడు రోజులకోసారి స్క్రబ్ చేసుకోవచ్చు.. లేదా వారానికి రెండు సార్లు ముఖానికి కూరగాయ లేదా పండ్ల గుజ్జుతో (టొమాటో, బంగాళాదుంప, కీరా, బొప్పాయి, అరటి వంటివి) ముఖానికి ప్యాక్ వేసుకోవచ్చు. అదీ కుదరకపోతే రోజుకోసారి రోజ్ వాటర్‌‌తో ముఖాన్ని కడుక్కోవచ్చు. వీటిలో ఏదో ఒకటి పాటిస్తే చాలు.

ఇక వీటితోపాటు చర్మం బిగుతుగా ఉండేందుకు రోజువారీ వ్యాయామం చేయడం చాలాముఖ్యం. ఎక్సర్ సైజ్ చేయడం ద్వారా చర్మం బిగుతుగా ఉండడమే కాక చెమట రూపంలో చర్మం డీటాక్స్ కూడా అవుతుంది. అలాగే బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి ఎండ తగలకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మధ్య వయసులో కూడా యవ్వనంగా కనిపించొచ్చు.

Tags:    
Advertisement

Similar News