Shooting Updates | ఏ సినిమా ఎక్కడ?

Shooting Updates - రవితేజ, బాలకృష్ణ, నాని సినిమాల షూటింగ్స్ ఎంత వరకు వచ్చాయి?

Advertisement
Update: 2024-01-29 17:17 GMT

తన కొత్త సినిమా షూటింగ్ లో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. త్వరలోనే విదేశీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

రవితేజ ప్రస్తుతం కరైకుడిలో ఉన్నాడు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య సీన్స్ తీస్తున్నారు.

హీరో నాని ఓల్డ్ సిటీలో ప్రత్యక్షమయ్యాడు. ఓల్డ్ సిటీలో రద్దీగా ఉండే ఓ ప్రాంతంలో సరిపోదా శనివారం సినిమా కోసం కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. కథ ప్రకారం, ఇలాంటి రద్దీ ప్రాంతం ఒకటి కావాలంట. అన్నట్టు ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే.

దుల్కర్ సల్మాన్ తెలుగులో చేస్తున్న మరో సినిమా లక్కీ భాస్కర్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

రాబిన్ హుడ్ కేరళ వెళ్లాడు. నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పేరు ఇది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కేరళలోని అందమైన లొకేషన్లలో ఓ సాంగ్ తీస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News