Sridevi Sobhanbabu - శ్రీదేవి శోభన్ బాబు విడుదల తేదీ ఫిక్స్

Sridevi Sobhanbabu - సంతోష్ శోభన్ హీరోగా నటించిన చిత్రం శ్రీదేవి శోభన్ బాబు. ఈ సినిమా విడుదలకు సిద్ధం అయింది.

Advertisement
Update: 2023-02-06 11:11 GMT

సంతోష్ శోభన్, గౌరి కిషన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన‌న్ని సుస్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేస్తున్నారు.

హీరో సంతోష్‌ శోభన్, దర్శకుడు ప్ర‌శాంత్‌ని అనుకోకుండా ఓ కాఫీ షాప్‌లో క‌లిశారు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణెదల. అలా స్టార్ట్ అయిన వాళ్ల ప్ర‌యాణం ఈ సినిమా వరకు వచ్చింది. చిన్న ఆలోచనతో మొదలైన ఈ ప్రాజెక్టు, ఇప్పుడు విడుదల వరకు వచ్చింది. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ కు ఇదే తొలి ఫీచర్ ఫిలిం. ఇంతకుముందు వీళ్లు వెబ్ సిరీస్ తీశారు.

సిటీలో పుట్టి పెరిగిన సంతోష్‌లాంటి హీరో ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ పాత్రను అద్భుతంగా చేశాడని మెచ్చుకున్నారు సుస్మిత. గౌరికి తెలుగు రాక‌పోయినా సుస్మితతో కూర్చుని త‌మిళంలో అర్థం తెలుసుకుని దాన్ని తెలుగులో నేర్చుకుని మరీ న‌టించిందట. కమ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఈరోజు నుంచి పాటల విడుదల కార్యక్రమం మొదలైంది. మరో వారం రోజుల్లో ట్రయిలర్ రిలీజ్ చేసి సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలనుకుంటున్నారు. ఇదొక చక్కటి కుటుంబ కథాచిత్రం అంటోంది యూనిట్.

Tags:    
Advertisement

Similar News