మరోసారి పోలీస్ గెటప్ లో సముత్తరఖని

సముత్తరఖని మరోసారి పోలీస్ గా మారాడు. ఈ సారి ఏ సినిమా. చెక్ చేద్దాం రండి

Advertisement
Update: 2022-10-18 12:06 GMT

రీసెంట్ గా పోలీస్ గెటప్ లో కనిపించారు సముత్తరఖని. చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సముత్తరఖని పోలీసాఫీసర్. ఆ సినిమా ఇంకా థియేటర్లలో నడుస్తోంది. అఁతలోనే సముత్తరఖని మరోసారి పోలీస్ గెటప్ లోకి మారారు. ఈసారి మరో సినిమాలో ఆయన ఖాకీ చొక్కా వేశారు.


యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ నటిస్తున్న రెండో సినిమా ''నేను స్టూడెంట్ సార్!'. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై 'నాంది' సతీష్ వర్మ నిర్మిస్తున్నాడు. రాకేష్ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. మరో దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించాడు.


ఈ చిత్రంలో అర్జున్ వాసుదేవన్‌గా నటిస్తున్న సముద్రఖని ఫస్ట్‌లుక్‌ను ఈ రోజు విడుదల చేశారు. పాత్ర పేరు సూచించినట్లుగా, సముద్రఖని హీరోయిన్ అవంతిక తండ్రి గా కనిపించనున్నారు. అవంతిక పాత్ర పేరు శృతి వాసుదేవన్ గా ఇదివరకే పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సముద్రఖని సీరియస్ గా నడిచివస్తున్న పోలీసు అధికారిగా కనిపించారు. 


ఈ సినిమాలో సునీల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.




Tags:    
Advertisement

Similar News