Naga Chaitanya: ఆ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడా?

Naga Chaitanya And Sobhita Dhulipala: ఈ హీరోహీరోయిన్ డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు గుప్పుమంటున్నాయి. దీనికి కారణం ఈ ఒక్క ఫొటో..

Advertisement
Update: 2022-11-27 10:47 GMT

ఉన్నట్టుండి సడెన్ గా ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూలిపాళ్ల కలిసి దిగిన ఫొటో ఇది. దీంతో వీళ్లిద్దరిపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ప్రస్తుతం సింగిల్ గా ఉన్న నాగచైతన్య, శోభితతో డేటింగ్ చేస్తున్నాడంటూ వరుసగా కథనాలు పుట్టుకొచ్చాయి. ఆమధ్య నాగచైతన్య, దక్ష నగార్కర్ డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు రాగా, ఇప్పుడు చైతూ-శోభితపై అలాంటి పుకార్లే వస్తున్నాయి.

ఈ మొత్తం గాసిప్స్ కు కారణమైన ఆ ఫొటో ఒరిజినల్ కాదు. ఓ అభిమాని నాగచైతన్యతో ఫొటో దిగింది. ఆ వెంటనే శోభితతో కూడా ఫొటో దిగింది. ఆ రెండు ఫొటోల్ని ఇలా ఫొటోషాప్ లో మిక్స్ చేసి వదిలారు కొంతమంది. దీంతో చైతూ-శోభిత డేటింగ్ లో ఉన్నట్టు చాలామంది భావించారు.

ప్రస్తుతం నాగచైతన్య లండన్ లో ఉన్నాడు. రీసెంట్ గా తన పుట్టినరోజును అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వారంలోనే అతడు తిరిగి హైదరాబాద్ వస్తాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తాడు.

Tags:    
Advertisement

Similar News