Ruhani Sharma - వెంకీ సినిమాలో 'హిట్' హీరోయిన్

Ruhani Sharma Saindhav Movie - వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమాలోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది.

Advertisement
Update: 2023-04-22 02:45 GMT

విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ 'సైంధవ్' కు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటించనున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో డాక్టర్ రేణు పాత్రను రుహాని శర్మ పోషిస్తోంది. దర్శకుడి మొదటి చిత్రం 'HIT'లో కనిపించిన రుహాని.. సైంధవ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి సంబంధించి క్యారెక్టర్ లుక్ పోస్టర్‌ కూడా రిలీజ్ చేశారు.

ప్రధాన తారాగణంతో సైంధవ్ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మణికందన్ కెమెరామెన్. అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది సైంధవ్ మూవీ.

Tags:    
Advertisement

Similar News