హేమలతగా మారిన రేణుదేశాయ్

టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Advertisement
Update: 2022-09-30 06:30 GMT

రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు. 1970ల్లో స్టువర్ట్‌పురం ప్రాంతంలో నివశించిన పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని బేస్ చేసుకొని, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో రేణు దేశాయ్ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో రేణు దేశాయ్ హేమవతి లవణం అనే చాలా ముఖ్యమైన, పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఇది నిజ జీవిత పాత్ర. హేమలత లవణం సామాజిక కార్యకర్త, రచయిత. అప్పటి సమాజంలో ఉన్న అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు.

వీడియోలో రేణు దేశాయ్ తెల్లచీరలో కనిపించే మరో ఇద్దరు మహిళా కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నడుస్తూ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఈ పాత్రను మరింత ఎలివేట్ చేసింది.

ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ వేశారు.


Full View


Tags:    
Advertisement

Similar News