Rakul Preet Singh: నా పెళ్లి ఎలా జరిగిందో చెప్పండి

Rakul Preet Singh reacts on her marriage: తన పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలపై రకుల్ స్పందించింది. మీడియాపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది

Advertisement
Update: 2023-02-24 11:00 GMT

Rakul Preet Singh: నా పెళ్లి ఎలా జరిగిందో చెప్పండి

మీడియాపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది రకుల్ ప్రీత్ సింగ్. తన పెళ్లిపై వస్తున్న పుకార్లను ఎప్పటికప్పుడు ఖండిస్తున్న ఈ బ్యూటీ, ఈసారి ఒకింత కోపాన్ని ప్రదర్శించింది. తనకు ఎన్నిసార్లు పెళ్లి చేస్తారంటూ ప్రశ్నించింది. 


"ప్రతి వారం నా గురించి ఏదో ఒకటి రాస్తుంటారు. అవన్నీ నేను గూగుల్ చేయను. అయితే గూగుల్ అలర్ట్ రూపంలో అవన్నీ నాకు చేరుతుంటాయి. కానీ నేను వాటిని చదవను. నా పెళ్లిపై వచ్చిన వార్తల్ని అలా చూసి ఇలా వదిలేస్తాను. గత నవంబర్ లోనే నా పెళ్లి అయిపోయిందని రాశారు. అది ఎలా జరిగిందో చెబితే సంతోషిస్తాను."


కేవలం ఆరోగ్య పరమైన అప్ డేట్స్ కోసమే తను గూగుల్ చేస్తానని, తనపై వచ్చే వార్తల కోసం కాదని రకుల్ ప్రీత్ స్పష్టం చేసింది. ఏ పదార్థంలో ఎన్ని కాలరీలున్నాయనే అంశాన్ని తెలుసుకోవడం తనకు చాలా ఇష్టమని వెల్లడించింది. 


ఈ ఏడాది ఇప్పటికే ఛత్రీవాలా అనే సినమాతో థియేటర్లలోకి వచ్చింది రకుల్. ప్రస్తుతం ఆమె అయలాన్, ఇండియన్2 సినిమాల్లో నటిస్తోంది.

Tags:    
Advertisement

Similar News