Priyanka Mohan | లిప్ కిస్సుపై ప్రియాంక మోహన్ రియాక్షన్

Priyanka Mohan - హీరోయిన్ ప్రియాంక మోహన్, లిప్ కిస్సులపై స్పందించింది. అలాంటి సన్నివేశాల్లో నటించనంటోంది ఈ బ్యూటీ.

Advertisement
Update: 2024-02-01 16:46 GMT

తాజాగా కెప్టెన్ మిల్లర్ సినిమాతో తెరపైకొచ్చింది ప్రియాంక మోహన్. తమిళ్ లో ఈ సినిమా హిట్టవ్వగా, తెలుగులో మాత్రం ఫ్లాప్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, 29 ఏళ్ల ఈ నటిని తెరపై ముద్దు సన్నివేశాలు చేస్తావా అని అడిగింది మీడియా. దీనిపై ఆమె సూటిగా స్పందించింది.

ముద్దు సన్నివేశాల్లో నటిస్తానా లేదా అనే విషయాన్ని ఇప్పుడు చెప్పలేనని, తనకు ఇప్పటివరకు అలాంటి స్క్రిప్ట్ రాలేదని చెప్పింది ప్రియాంక మోహన్. అయితే స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పటికీ, లిప్ కిస్ లో నటించడం తనకు అసౌకర్యంగా ఉంటుందని స్పష్టం చేసింది.

ప్రస్తుతం స్కిన్ షోకు కాస్త దూరంగా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రియాంక మోహన్ మాత్రమే. ఆమె గ్లామరస్ గా కనిపించడానికి ఇష్టపడదు, అదే టైమ్ లో లిప్ కిస్సులకు కూడా నో చెబుతోంది. హోమ్లీగా ఉండే పాత్రలు మాత్రమే చేస్తానంటోంది.

నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ప్రస్తుతం అదే హీరో సరసన సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు పవన్ కల్యాణ్ సరసన ఓజీ సినిమాలో నటిస్తోంది.

Tags:    
Advertisement

Similar News