Kalki | మే 9న ప్రభాస్ సినిమా విడుదల

Kalki - ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమాకు తాజాగా విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Advertisement
Update: 2024-01-12 17:15 GMT

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “కల్కి 2898 AD” షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రభాస్ త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నాడు. అతడు సెట్స్ పైకి వచ్చిన వెంటనే సినిమా షూటింగ్ పూర్తవుతుంది.

ఇదిలా ఉంటే, “కల్కి 2898 AD” నిర్మాతలు ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ టీజర్‌ కంటే ముందు, సినిమా విడుదల తేదీని ప్రకటించారు. కల్కి సినిమాను మే 9న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

"కల్కి 2898 AD" అనేది సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జానర్‌లో చాలా అంచనాలతో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఉన్నారు. ఈ చిత్రాన్ని అశ్వినీదత్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

నిజానికి ఈ సినిమాను ఈ సంక్రాంతికి షెడ్యూల్ చేశారు. అయితే ప్రభాస్ మోకాలి శస్త్రచికిత్స కారణంగా సినిమా లేట్ అయింది. దీంతో సంక్రాంతి బరి నుంచి వాయిదా వేశారు. అలా వాయిదాపడిన ఈ సినిమా మే 9న విడుదలకానుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై గతంలో తెరకెక్కిన మహానటి, జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలు కూడా మే9వ తేదీనే విడుదలయ్యాయి. 

Tags:    
Advertisement

Similar News