OG Movie | పవన్ సినిమా పోస్ట్ పోన్

Pawan Kalyan OG Movie - లెక్కప్రకారం, ఈ ఏడాదిలోనే రావాలి ఓజీ సినిమా. కానీ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా వాయిదా పడింది.

Advertisement
Update: 2023-08-14 03:07 GMT

పవన్ కల్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు 3. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు అతడి చేతిలో ఉన్నాయి. వీటిలో కాస్త వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, 3 షెడ్యూల్స్ కే 50శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

దీంతో ఈ ఏడాది క్రిస్మస్ నాటికి ఓజీ రిలీజ్ అవుతుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది ఓజీ సినిమా థియేటర్లలోకి రావట్లేదు. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ త్వరగానే పూర్తవుతున్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా టైమ్ కావాలంట. అందుకే సినిమాను వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది.

మరికొంతమంది, మరో రీజన్ కూడా చెబుతున్నారు. ఓజీ సినిమాను తెరవెనక సెట్ చేసిన వ్యక్తి త్రివిక్రమ్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పక్కనపెట్టి మరీ ఓజీని పట్టాలపైకి తీసుకువచ్చారు త్రివిక్రమ్. ఆయన సలహాలు-సూచనలు లేకుండా సినిమా ముందుకు కదలదు.

కట్ చేస్తే, మహేష్ బాబు సినిమాతో త్రివిక్రమ్ బిజీ అయిపోయాడు. మరో 3-4 నెలలు అందుబాటులోకి వచ్చేలా లేడు. ఓజీ సినిమా రిలీజ్ వాయిదా వేయడానికి ఇది కూడా ఓ కారణమని చెబుతున్నారు. అటు తమన్ కూడా కాస్త టైమ్ కోరినట్టు తెలుస్తోంది.

ఇలా ఎన్నో కారణాల వల్ల ఓజీ సినిమాను ఈ ఏడాది నుంచి వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఓజీ సినిమా థియేటర్లలోకి వస్తుంది. 

Tags:    
Advertisement

Similar News