Bro movie teaser | పవన్ కల్యాణ్ సినిమా టీజర్ రిలీజ్

Pawan Kalyan's Bro movie teaser | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తాజా చిత్రం బ్రో(Bro). ఈరోజు ఈ సినిమా టీజర్ (teaser) రిలీజైంది.

Advertisement
Update: 2023-06-29 14:50 GMT

Bro movie teaser | పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా బ్రో. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాకు, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతోంది ఈ మూవీ.

టైటిల్ మోషన్ పోస్టర్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ద్వయం పోస్టర్ సహా 'బ్రో' చిత్రం నుండి విడుదలైన ప్రతి ప్రచార చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జూలై 28న విడుదల కానున్న నేపథ్యంలో, ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు.

చీకటిలో చిక్కుకొని ఒకరి సహాయం కోరుతున్న సాయి ధరమ్ తేజ్ వాయిస్‌తో టీజర్ మొదలవుతుంది. అతను వారిని 'మాస్టర్', 'గురు', 'తమ్ముడు' అని రకరకాలుగా సంబోధిస్తాడు. చివరకు 'బ్రో' అని పిలుస్తాడు. ఆ తర్వాత పెద్ద ఉరుము పవన్‌ కళ్యాణ్ రాకకు స్వాగతం పలుకుతుంది. 'తమ్ముడు' సహా తన ఇతర హిట్ చిత్రాలను గుర్తు చేస్తూ, టీ గ్లాస్ పట్టుకుని, పవర్ స్టార్ అనేక రకాల లుక్స్ లో కనిపిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ ఓం లాకెట్ ధరించి, మనోహరమైన చిరునవ్వుతో కనిపించాడు. ఆ తర్వాత కూలీ దుస్తులు ధరించి 'కాలం మీకు అంతు పట్టని ముడి జాలం' అంటూ సాయి ధరమ్ తేజ్‌కి స్వాగతం పలికాడు. అల్లరిగా కనిపించే సాయి ధరమ్ తేజ్‌తో ఆయన సరదాగా ఆడుకుంటాడు. గిటార్ పట్టుకుని పార్టీలో డ్యాన్స్ చేయడం నుండి స్టార్‌ల మధ్య హాస్య సంభాషణల వరకు అభిమానుల చేత విజిల్ వేయించే అద్భుతమైన మూమెంట్స్ టీజర్ లో ఎన్నో ఉన్నాయి.

'సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా నువ్వు' అంటూ కారులో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ని ముగించిన తీరు బాగుంది. సినిమాలో వినోదానికి కొదవ లేదనే విషయాన్ని ఇది సూచిస్తుంది. ప్రధాన అంశాన్ని రివీల్ చేయకుండానే, టీజర్ ని ఎంతో ఆకర్షణీయంగా రూపొందించారు.

ఇందులో టైటిల్ పాత్రధారి 'బ్రో'గా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా, మార్క్- మార్కండేయులుగా సాయి ధరమ్ నటిస్తున్నాడు. తమన్ ఆకట్టుకునే నేపథ్య సంగీతం, అందమైన విజువల్స్, పవన్ కళ్యాణ్ అద్భుతమైన కామెడీ టైమింగ్‌.. టీజర్ లో హైలెట్స్.


Full View


Tags:    
Advertisement

Similar News