Jr NTR, Janhvi Kapoor Movie: ఎన్టీఆర్-కొరటాల సినిమా మొదలైంది

Jr NTR, Janhvi Kapoor Movie: ఎట్టకేలకు ఎన్టీఆర్-కొరటాల సినిమా లాంఛ్ అయింది. హీరోయిన్ జాన్వి కపూర్ కూడా లాంచింగ్ కు హాజరైంది.

Advertisement
Update: 2023-03-23 15:19 GMT

Jr NTR, Janhvi Kapoor Movie: ఎన్టీఆర్-కొరటాల సినిమా మొదలైంది

ఎన్టీఆర్ హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ #NTR30. ఈరోజు ఈ సినిమా గ్రాండ్ లెవ‌ల్లో పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ మూవీ లాంచింగ్‌ కార్య‌క్ర‌మానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్స్ రాజ‌మౌళితో పాటు ప్ర‌శాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంకా ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు, బి.వి.ఎస్‌.ఎన్.ప్ర‌సాద్, ఏషియ‌న్ సునీల్, అభిషేక్ నామా, అభిషేక్ అగ‌ర్వాల్‌, భ‌ర‌త్ చౌద‌రి, జాన్వీ క‌పూర్‌, ప్ర‌కాష్ రాజ్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్‌ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి రాజ‌మౌళి క్లాప్ కొట్టగా, కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్ర‌శాంత్ నీల్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు.

"ఎన్టీఆర్‌ తో సెకండ్‌ టైమ్‌ సినిమా చేస్తున్నాను. జనతాగ్యారేజ్‌ తర్వాత ఆయనతో పనిచేసే అవకాశం రావడం చాలా లక్కీ. ఈ జెనరేషన్‌ బెస్ట్ యాక్టర్‌ ఎన్టీఆర్‌. నా బ్రదర్‌ ఆయన. సినిమా ఐడియా విషయానికొస్తే.. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న, గుర్తుతెలియని ప్రాంతాల్లో నడిచే కథ ఇది. ఈ కథలో మనుషుల కన్నా ఎక్కువ మృగాలు ఉంటారు. భయమంటే ఏంటో తెలియని మృగాలుంటారు. దేవుడంటే భయం లేదు. చావంటే భయం లేదు. కానీ, ఒకే ఒకటంటే భయం వారికి. ఆ భయమేంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి ఈ సినిమాలో నా ప్రధాన పాత్ర ఏ రేంజ్‌కి వెళ్తుందనేది ఎమోషనల్‌ రైడ్‌."

ఇలా సినిమా స్టోరీలైన్ ఏంటనే విషయాన్ని కొరటాల శివ చూచాయగా బయటపెట్టారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దాదాపు ఏడాదిగా ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న కొరటాల, త్వరలోనే మూవీని సెట్స్ పైకి తీసుకెళ్తాడు.

తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 

Tags:    
Advertisement

Similar News