Bhagavanth Kesari | దంచవే మేనత్త కూతురా సాంగ్ వచ్చేసింది

Bhagavanth Kesari Movie - బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా థియేటర్లలో నడుస్తోంది. ఇప్పుడీ సినిమాకు ఓ సాంగ్ జత చేశారు.

Advertisement
Update: 2023-10-26 14:25 GMT

భగవంత్ కేసరిలోని మాస్ పాటను థియేటర్లలోకి తీసుకొచ్చారు. బాలకృష్ణ పాత సినిమాలోని "దంచవే మేనత కూతురా" రీమిక్స్ సాంగ్ ఇది. దీనికి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత, కథకు అడ్డంగా ఉందని భావించి, సాంగ్ ను కట్ చేశారు. ఆ విషయాన్ని విడుదలకు ముందే ప్రేక్షకులకు తెలియజేశారు. ఇప్పుడు పండగ వేళ ఆ సాంగ్ ను యాడ్ చేశారు.

తాజాగా యాడ్ చేసిన ఈ రీమిక్స్ సాంగ్ మరోసారి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ సాంగ్ మొత్తాన్ని పెట్టలేదు. నాలుగున్నర నిమిషాల పాటలో, కేవలం దంచవే మేనత్త కూతురా అనే 90 సెకెన్ల నిడివి ఉన్న రీమిక్స్ వెర్షన్ ను మాత్రమే యాడ్ చేశారు. అది కూడా భగవంత్ కేసరి రోలింగ్ టైటిల్స్ కు పెట్టారు.

నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’కి ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమాలో కమర్షియల్ పాటలు లేకపోవడం కొంత మంది అభిమానులకు నిరాశ కలిగించింది. ఇప్పుడు, భగవంత్ కేసరికి మాస్ పాటను జోడించడంతో, అభిమానులు మరోసారి థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది.

బాలయ్య హీరోగా నటించిన ఈ సినిమాలో అతడి కూతురు వరుస పాత్రలో శ్రీలీల నటించింది. బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్ నటించగా.. సినిమాకు తమన్ సంగీతం అందించాడు. హరీశ్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించారు. దసరా బరిలో రిలీజైన ఈ సినిమా, దసరా విన్నర్ గా నిలిచింది. ఈ మూవీతో బాలయ్య హ్యాట్రిక్ కొట్టినట్టయింది. అతడు నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు మూడూ హిట్టయ్యాయి.

Tags:    
Advertisement

Similar News