The Ghost: ఓటీటీలోకి నాగార్జున సినిమా

నాగార్జున నటించిన తాజా చిత్రం ది ఘోస్ట్. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement
Update: 2022-11-02 03:12 GMT

దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఫ్లాప్ అయిన సినిమాలు ముందుగా ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి.

ఇందులో భాగంగా స్వాతిముత్యం సినిమా ఇప్పటికే ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ది ఘోస్ట్ సినిమా వంతు వచ్చింది.

నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తాజాగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సందర్భంగా సదరు ఓటీటీ మరోసారి హంగామా షురూ చేసింది. ప్రత్యేకంగా ట్రయిలర్ కట్ చేసి విడుదల చేసింది. సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం కూడా చేస్తోంది.

నాగ్-సోనాల్ చౌహాన్ జంటగా నటించిన ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నప్పటికీ, ఎమోషన్ కనెక్ట్ అవ్వక ఫ్లాప్ అయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

దసరాకు రిలీజైన గాడ్ ఫాదర్ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా కూడా త్వరలోనే స్ట్రీమింగ్ కు రాబోతోంది.

Tags:    
Advertisement

Similar News