Mugguru Kodukulu: కృష్ణ కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రం

Mugguru Kodukulu- ముగ్గురు కొడుకులు సినిమా కృష్ణకు ఎంతో ఇష్టమైన మూవీ. తొలిసారి కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు కలిసి నటించిన సినిమా ఇదే.

Advertisement
Update: 2022-11-15 03:55 GMT

కెరీర్ లో 340కి పైగా సినిమాల్లో నటించారు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు, ఎన్నో రికార్డులు సృష్టించారు. అయితే ఒక సినిమా మాత్రం ఆయనకు ఎంతో ప్రత్యేకం, మరెంతో ఇష్టం కూడా. అదే ముగ్గురు కొడుకులు సినిమా. ఇంతకీ ఈ సినిమా ప్రత్యేకత ఏంటి? కృష్ణకు ఎందుకు ఈ మూవీ అంటే అంతిష్టం?

కృష్ణ తల్లి పేరు నాగరత్నమ్మ. కృష్ణతో కలిపి ఆమెకు ముగ్గురు కొడుకులు. అందుకే ఆ టైటిల్ తో సినిమా ఒకటి కృష్ణ తీస్తే చూసి ముచ్చటపడాలనేది కోరిక. తల్లి కోరికను తెలుసుకున్న కృష్ణ వెంటనే పనులు మొదలుపెట్టారు. మంచి కథ సిద్ధం చేశారు. తను, రమేష్ బాబు, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తూ ముగ్గురు కొడుకులు అనే సినిమా తీశారు.

ఈ సినిమాకు స్వయంగా కృష్ణ దర్శకత్వం వహించారు. మహేష్ బాబు చదువుకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో, సినిమాను ఊటీలో పూర్తి చేశారు. ఈ సినిమాకు నిర్మాతగా తల్లి నాగరత్నమ్మ పేరు వేశారు మహేష్ బాబు.

ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే కృష్ణను తొలిసారి ఆశ్చర్యపరిచారు మహేష్ బాబు. చిన్న వయసులోనే గుక్కతిప్పుకోకుండా డైలాగ్స్ చెప్పిన మహేష్, కృష్ణ ఆశ్చర్యపోయేలా చేశారు.

ఈ సినిమాలో మరో రెండు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇందులో కృష్ణ కూతురు ప్రియ కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. ఇక ఈ సినిమాలో కృష్ణ, అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపించారు.

1988, అక్టోబర్ 20 రిలీజైంది ముగ్గురు కొడుకులు సినిమా. తన కోరిక తీరినందుకు నాగరత్నమ్మ చాలా సంతోషించింది. అయితే సినిమా వంద రోజుల వేడుకలో పాల్గొనకుండానే కన్నుమూసింది.




Tags:    
Advertisement

Similar News